యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు (మే 20న) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన 37వ ఏట అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ సింపుల్‌గా ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పలేదు. ఒక పాటతో ఎన్టీఆర్‌కు ట్రిబ్యూట్ ఇచ్చారు. ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ట్రిబ్యూట్ టు మాస్ కా బాప్ ఎన్టీఆర్’ అనే పేరుతో విడుదల చేసిన ర్యాప్ సాంగ్ ప్రస్తుతం నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను వివేక్ సాగర్ కంపోజ్ చేశారు. ఆదిత్య రావు గంగసాని రాసి, స్వయంగా పాడారు. సుమారు ఒక నిమిషం పాటు ఉన్న ఈ పాటను ఫోన్, వెస్ట్రన్ మిక్స్ చేసి కొట్టారు వివేక్ సాగర్. ఇదిలా ఉంటే, ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్‌సేన్.. ఈ ఏడాది ‘హిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను హీరో నాని స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం ‘పాగల్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ఈ సినిమా మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
from https://ift.tt/3cN3EYr
No comments:
Post a Comment