అతను బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగితే పరుగుల వరదే. క్రీజ్‌లో ఉన్నంత సేపూ వీరబాదుడే. బంతి లయ తప్పిదండే బౌలర్‌కి చుక్కలే.. అతడే ఆస్ట్రేలియన్ హిట్టర్ . ఇక ఈయన డైలాగ్ రాశారంటే బుల్లెట్ జనం మైండ్‌లోకి దూసుకునిపోతుంది. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? అంటూ ఇండస్ట్రీని షేర్ చేసే డైలాగ్‌లతో హీరోలను సరికొత్త మేనరిజంలో చూపించి ఇండస్ట్రీ హిట్స్ ఇస్తుంటారు.. ఆయనే . మరి వార్నర్ గ్రౌండ్‌లో సిక్స్‌లు బాదితే.. పూరీ మార్క్ డైలాగ్‌లతో బాక్సాఫీస్‌ని బాదుతుంటారు. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే.. పూరీ మార్క్ డైలాగ్‌లు డేవిడ్ వార్నర్ నోటి వెంట వస్తే బొమ్మ దద్దరిల్లిపోవడం గ్యారంటీనా అంటే ఈ ఇద్దరూ కూడా అందుకు సై అంటున్నారు. అవును.. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో నెంబర్ వన్ బ్యాట్స్ మ్యాన్‌గా ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడిగా చెలరేగి ఆడే వార్నర్‌కి లాక్ డౌన్ కారణంగా ఫుల్ గ్యాప్ దొరకడంతో.. తనలోని మల్టీ టాలెంట్‌ను బయటకు తీస్తున్నాడు. ఇటీవల బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా అంటూ భార్యతో కలిసి స్టెప్పులు వేసిన వార్నర్.. బ్యాట్ పట్టుకుని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ’ అంటూ పూరీ-మహేష్ సన్సేషనల్ కాంబో మూవీ పోకిరి నుంచి డైలాగ్‌లు పలికించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. దర్శకుడు పూరీ స్పందిస్తూ.. ‘డేవిడ్ నువ్ సూపరబ్బా.. ఈ పవర్ ఫుల్ డైలాగ్ నీకు సరిగ్గా సరిపోతుంది. మొండి పట్టుదల, దూకుడు కలగలిసిన వ్యక్తివి నీవు. ఈ డైలాగ్‌కి అద్భుతంగా చేశావ్.. నా సినిమాలో నువ్వు ఓ పాత్ర చేస్తావని భావిస్తున్నా.. లవ్ యూ వార్నర్" అని పూరీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై వార్నర్ స్పందిస్తూ.. ‘ట్రై చేస్తా సార్.. కాని సన్ రైజర్స్ విడుదల చేస్తారా లేదా అన్నది మీరు చూడాల్సి ఉంది’ అంటూ స్మైల్ ఎమోజీలతో పూరీ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు వార్నర్.
from https://ift.tt/35LaElI
No comments:
Post a Comment