ఈ నెల 20వ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన అభిమానులతో పాటు ఎందరో సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలిపారు. అయితే యంగ్ హీరో మాత్రం ' మాస్ కా బాప్' అంటూ ఓ ట్రిబ్యూట్ సాంగ్ రెడీ చేసి రిలీజ్ చేశారు. విశ్వక్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాలోని రాప్ సాంగ్‌ను విశ్వక్ ట్రిబ్యూట్ సాంగ్‌గా వాడుకున్నాడు. ఎన్టీఆర్ విజువల్స్‌తో కూడిన ఈ సాంగ్ వైరల్ అయింది. అయితే ఇప్పుడీ సాంగ్ ఇష్యూ వివాదాస్పదంగా మారింది. తన అనుమతి లేకుండా విశ్వక్ ఈ సాంగ్‌ను వాడుకున్నాడంటూ ఆ సినిమా సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ పాటను వెంటనే తొలగించాలని వివేక్ సాగర్ అన్నాడు. కానీ ఆ మాటలు విశ్వక్ సేన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో విశ్వక్‌పై వివేక్‌సాగర్ లీగల్ చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్. Also Read: మరోవైపు విశ్వక్‌సేన్ మాత్రం 'ఫలక్‌నుమాదాస్' సినిమాలో తానే హీరో పైగా ఆ సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించింది కూడా తానే కాబట్టి సర్వహక్కులు తనవేనని అంటున్నాడు. ‘పాటకు సంబంధించిన వివేక్‌కు క్రెడిట్ ఇచ్చాం. ఆయన అనుమతి లేకుండా చేయడం నా తప్పే. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా’ అని మాత్రం విశ్వక్ సేన్ అన్నాడు. కానీ వివేక్‌సాగర్ అంతటితో అంగీకరించలేదని లీగల్ యాక్షన్ దిశగా వెళ్తున్నారని సమాచారం. సో.. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందనేది.
from https://ift.tt/2ZxxSe6
No comments:
Post a Comment