కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ దేశంలో అన్ని రంగాల కార్య కలాపాలను స్తంభింపజేసింది. దీంతో ఈ ప్రభావం అన్ని రంగాలపై బాగానే చూపించింది. అటు సినీ ఇండస్ట్రీ సైతం బంద్ అయ్యింది. షూటింగులు లేక... కొత్త సినిమాలు విడుదల కాకా.. తారల నుంచి కార్మికుల వరకు అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో కొందరు ఆర్టిస్టులయితే ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. మరికొందరు మానసిక ఒత్తిడి అప్పుల బాధలు తట్టుకోలేక బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో దేశంలో తొలిసారిగా బాలీవుడ్ స్టార్ హీరో కెమరా ముందుకు వచ్చాడు. ముఖానికి మేకప్ వేసుకుని షూటింగ్‌కు సిద్ధమయ్యాడు. అక్షయ్ షూటింగ్ వార్త వినిగానే బాలీవుడ్ అంతా షాక్ అయ్యింది. ఎందుకంటే కరోనా వైరస్ లాక్ డౌన్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ... తన అభిమానులకు సైతం పలు విషయాలు షేర్ చేస్తూ వస్తున్న అక్షయ్ లాక్ డౌన్ నిబంధనల్ని పాటంచకపోవడం ఏంటని షాక్ తిన్నారు. అయితే ఇదేదో సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన 'ఆయుష్మాన్ భారత్' ప్రచారానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన కోసం షూట్ కోసం కెమెరా ముందుకొచ్చాడు అక్షయ్ కుమార్. ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కి దర్శకత్వంలో ఈ వాణిజ్య ప్రకటన చిత్రాన్ని తాజాగా ముంబైలోని కమలిస్తాన్ స్టూడియోలో చిత్రీకరించారు. సుమారు రెండు గంటల పాటు ఈ షూట్ కొనసాగింది. ఇందుకోసం ముంబై పోలీస్ కమీషనర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అలాగే షూటింగు ప్రదేశంలో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని ముందు జాగ్రత్తలను తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల్ని పాటించి షూట్ కంప్లీట్ చేశారు. ఈ విధంగా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తొలిసారిగా షూటింగ్ చేసిన ఘనత అక్షయ్ కుమార్‌కే దక్కింది. కరోనా వైరస్ కోసం అక్షయ్ కుమార్ భారీగా విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
from https://ift.tt/3gpgJZW
No comments:
Post a Comment