సినిమా హీరోలకు అభిమానులే బలం, బలహీనత. అభిమానులు అంటూ లేకపోతే హీరోలు లేరు. అందుకే, అభిమానులకు అంత విలువ ఇస్తుంటారు హీరోలు. రక్తం పంచుకుని పుట్టుకపోయినా సొంత అన్నదమ్ముళ్లులా భావిస్తుంటారు. తమ హీరోను నంబర్ వన్ స్థానంలో ఉంచడానికి అభిమానులు ఎంతో కష్టపడుతుంటారు. తమ అభిమాన హీరోకు సంబంధించిన ఏ శుభకార్యాన్ని అయినా తమ ఇంట్లో వేడుకలా జరుపుకుంటారు. వాటిలో పుట్టినరోజు కూడా ఒకటి. తమ హీరో పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పండగే. ఎవరికి వారు కేక్ కటింగ్‌లు చేస్తుంటారు. తమ హీరో పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈసారి ఆ అవకాశం దక్కలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉండటంతో తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ఎన్టీఆర్ పిలుపునివ్వడంతో ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. అయితే, తమ అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా చాటుకున్నారు. అభిమానులు చూపించిన ఈ ప్రేమకు ముగ్దుడయ్యారు ఎన్టీఆర్. ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. Also Read: ‘‘మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. నా ప్రియమైన అభిమానులారా, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలాగే, తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులందరికీ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. Also Read: ‘‘ఎంతో ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నా సహచర నటీనటులకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రముఖులకు నా గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ట్వీట్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపించింది. ఈరోజు మీరంత నాకు ఎంతో ప్రత్యేకంగా చేశారు’’ అని ఎన్టీఆర్ ట్వీట్‌ను కొనసాగించారు.
from https://ift.tt/2AMbbZj
No comments:
Post a Comment