హీరోయిన్ రెజీనా కొత్త అవతారంలో ఫ్యాన్స్‌కు దర్శనమిచ్చారు. పాతకాలం హీరోయిన్‌లా మేకప్ వేసుకుని షాకింగ్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీన్ని డ్రాగ్ మేకప్ అంటున్నారు. ఎప్పుడూ ట్రెండీగా కనిపించే రెజీనా ఈ డ్రాగ్ మేకప్‌లో చాలా కొత్తగా కనిపించారు. అభిమానులను షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో అభిమానుల కోసం ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయం పడుతున్నారు. చాలా మంది తారలు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులను పలకరిస్తున్నారు. అయితే, హీరోయిన్ రెజీనా కాస్త కొత్తగా ఆలోచించారు. ‘నాట్ సో లేట్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సో నిర్వహిస్తున్నారు. ఇప్పటికి నాలుగు ఎపిసోడ్‌లు అయ్యాయి. వీటిలో నాలుగో ఎపిసోడ్ కాస్త ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇండియన్ డ్రాగ్ పెర్ఫార్మర్ మయామ్మతో రెజీనా లైవ్ షో నిర్వహించారు. ఆమెతో సుమారు గంటపాటు ముచ్చటించారు. ఇందులో విశేషమేమిటంటే ఒక డ్రాగ్ పెర్ఫార్మర్‌తో మాట్లాడటానికి రెజీనా కూడా డ్రాగ్ క్వీన్‌లా తయారయ్యారు. డ్రాగ్ మేకప్ వేసుకున్నారు. డ్రాగ్ క్వీన్ అంటే.. మగవాళ్లు అందమైన అమ్మాయిలా ఓవర్ మేకప్ వేసుకోవడం. అందమైన భామలా తయారవడం. Also Read: మయామ్మతో చేసిన లైవ్ షో కోసం వేసుకున్న మేకప్‌తో తీసుకున్న ఫొటోలను తాజాగా రెజీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో రెజీనా చాలా కొత్తగా కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అయితే రెజీనాను గుర్తుపట్టడం కూడా కష్టమే.
from https://ift.tt/3d05tB2
No comments:
Post a Comment