అలనాటి అందాల నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా యావత్తు భారత సినీ ప్రపంచాన్ని ఏలిన మకుటంలేని మహారాణి. బాల నటి నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి రెండు తరాల హీరోలతో నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు. రెండో తరం హీరోలతో ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా వాటిలోనూ ఆణిముత్యాలు ఉన్నాయి. అలాంటి ఆణిముత్యమే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి తొలిసారి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మలిచిన ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా విడుదలై నేటి(మే 9)కి 30 ఏళ్లు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు పనిచేసినప్పుడు తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో శ్రీదేవిపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదని అన్నారు. ఇంద్రజ పాత్ర, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా కేవలం శ్రీదేవి కోసమే పుట్టాయా అనిపిస్తుందని చిరంజీవి తెలిపారు. Also Read: ‘‘దేవకన్య పాత్రలో శ్రీదేవిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం. తన అందచందాలతో, తన హొయలతో, తన చిలక పలుకులతో, అమాయకపు చూపులతో, ఆ హావభావాలతో వావ్ అనిపించింది. శ్రీదేవి అత్యద్భుతంగా చేసింది. పాత్రలో లీనమైపోయింది. ఇప్పటికీ మనం శ్రీదేవిని తలుచుకుంటుంటే అతిలోక సుందరి అంటున్నామంటే ఆ పాత్ర ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, ఎంత లోతుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెతో పనిచేయడం నాకు ఒక అద్భుతమైన అవకాశం, అనుభూతి. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సాంగ్స్‌లో చేసేటప్పుడు నేను ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మనం కనిపించే పరిస్థితిలేదు. తన అందాలు, హొయలు, లుక్స్‌తో తినేస్తుంది. అలాంటి శ్రీదేవితో చేయడానికి ఫస్ట్‌టైమ్ నేను పోటీపడ్డాను. తనను మ్యాచ్ చేయడానికి కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది. అయినప్పటికీ, శ్రీదేవితో చేయడం అనేది నాకొక స్వీట్ మెమొరీ’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
from https://ift.tt/3bmtlx7
No comments:
Post a Comment