అబబ్బా.. ఇలాంటి ఆలోచననలు.. క్రియేటివిటీ.. పోలికలు వర్మ మినహా.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా.. తన సినిమా సినిమా ప్రమోషన్స్‌కి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు వర్మ. ఈరోజు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ మిలియన్ల కొద్దీ ట్వీట్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలో వర్మ.. చివరికి తననితాను గేతో పోల్చుకుంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీని షేర్ చేసి.. ‘హేయ్ తారక్.. నీ సిక్స్ ప్యాక్ బాడీ చూస్తే నేను గే అయితే బాగుండనిపిస్తుంది’ అంటూ పోస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఎన్టీఆర్ బర్త్ డే ట్వీట్స్ 12 మిలియన్లకు పైగా చేరుకుని టాప్ ట్రెడింగ్‌లో కొనసాగుతుండటంతో వర్మ తన బుర్రకు పదును పెట్టాడు. గతంలో మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా తీసిన వర్మ.. తాజాగా క్లైమాక్స్ అనే శృంగార రసభరిత చిత్రాన్ని రూపిందించాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసిన వర్మ.. ఈ సినిమాను సైతం ఆన్ లైన్‌లోనే విడుదల చేస్తున్నాడు. మే 29న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు వర్మ. ఇక వర్మ సినిమాలకు వర్మే పెద్ద ప్రమోషన్ ఫ్యాక్టర్ కాబట్టి.. ఎన్టీఆర్ బర్త్ డేను సైతం.. తన క్లైమాక్స్ సినిమాకు వాడేశాడు వర్మ. అంతకు ముందు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ చూసి.. గే అయితే బాగుండు అని మనసులో ఉన్న కోరికను బయటపెట్టిన వర్మ.. మియా మాల్కోవా తరువాత నేను చూసిన బెస్ట్ సెక్సీ బాడీ ఇదే అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే వర్మ పోస్ట్‌లపై అవాక్కు అయిన హీరో మంచు మనోజ్.. ‘మా వాడిని వదిలెయ్ అన్నో’ అంటూ దండాలు పెడుతూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌ని తన అరవింద సమేత సినిమాకి కూడా ఇంతిలా వాడుకోలేదు కాని.. వర్మ మాత్రం విరివిగా వాడేస్తున్నారు. ఆఖరుకి తనను తాను ‘గే’ అనుకుంటూ మరీ ప్రమోట్ చేస్తున్నాడు. ఎంతైనా.. వర్మ సార్.. వర్మ అంతే!
from https://ift.tt/2yhEJNq
No comments:
Post a Comment