‘కె.జి.ఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయనతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. అయితే, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఈ వార్తను పరోక్షంగా ఖరారు చేశారు. ఎన్టీఆర్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్.. అదే ట్వీట్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ప్రశాంత్ ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎన్టీఆర్ 31వ సినిమా ఇదేనా అనే చర్చ మొదలైంది. ‘‘మొత్తానికి అణు కర్మాగారం (నూక్లియర్ ప్లాంట్) పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్‌ను తీసుకొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు సోదర!!! ఈరోజు మీకు ఎంతో సురక్షితంగా, గొప్పగా ఉండాలి. త్వరలోనే కలుద్దాం.’’ అని తన ట్వీట్‌లో ప్రశాంత్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను నూక్లియర్ ప్లాంట్‌తో పోల్చడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. అంతేకాదు.. ప్రశాంత్ నీల్ తరవాత సినిమా కూడా ఎన్టీఆర్‌తోనే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రశాంత్ నీల్‌కు రూ.2 కోట్ల భారీ మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోందని అంటున్నారు. 2022లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే, వీటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే లేదు. మరోవైపు, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఎంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామా అని చూస్తున్నారు.
from https://ift.tt/2yjjESN
No comments:
Post a Comment