పవన్ కళ్యాణ్ అసలైన నాయకుడు: హీరోయిన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 17 May 2020

పవన్ కళ్యాణ్ అసలైన నాయకుడు: హీరోయిన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

జాతీయ పురస్కారం అందుకున్న ‘కంచె’ సినిమాలో చీరకట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించినా ప్రగ్యా స్టార్‌డమ్‌ను సంపాదించలేకపోయింది. వరుసపెట్టి సినిమాలు చేసినా కలిసిరాలేదు. ప్రగ్యా చివరిగా నటించిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమా పెద్ద డిజాస్టర్. ఈ సినిమా తరవాత మరే సినిమాలో ప్రగ్యా నటించలేదు. నిజం చెప్పాలంటే ఆమెకు అవకాశాలు రాలేదు. ప్రగ్యా వెండితెరపై కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోలకు బోలెడంత ఫాలోయింగ్. ప్రగ్యా జైస్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఎంతలా ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, ఆదివారం ప్రగ్యా జైస్వాల్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే, వీటిలో ఆమె చెప్పిన కొన్ని సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆమె స్పందించారు. ✦ అక్కినేని నాగార్జునతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది? నిజంగా అద్భుతం!! నాగార్జున గారు గొప్ప నటుడు, అద్భుతమైన మనిషి. ✦ ఈ లాక్‌డౌన్ సమయంలో మీరు చేసిన మంచి పని ఏమిటి? వంట చేయడం, బేకింగ్ చేయడం నేర్చుకోవడం. ✦ ఈ క్వారంటైన్ సమయంలో మీరు నేర్చుకున్న డిష్ ఏమిటి? బనానా చాకోలెట్ కేక్ ✦ లాక్‌డౌన్‌లో మీ డౌలీ రొటీన్ వర్క్ ఏమిటి? వర్కౌట్ చేయడం, వంట చేయడం, శుభ్రం చేయడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం. ✦ ‘అల వైకుంఠపురములో’ సినిమా చూశారా? చూశాను. చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎప్పుడూ అద్భుతమే. ✦ ఇప్పుడు మీరు చూస్తోన్న వెబ్ సిరీస్ ఏంటి? ది లాస్ట్ కింగ్‌డమ్ ✦ టాలీవుడ్ గురించి ఒక్క పదంలో చెప్పండి. హోమ్ ✦ సమంత గురించి ఒక్క పదంలో చెప్పండి. స్ఫూర్తిదాయకం ✦ లాయర్ నుంచి నటి అయ్యారు. మీరు నటి అవుతారని చిన్నతనంలో ఎప్పుడైనా అనుకున్నారా? నా చిన్నతనంలో అనుకోలేదు. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన తరవాత అనుకున్నాను. ✦ మీరు డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? ఎస్.ఎస్.రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ గారు ✦ రజినీకాంత్ గురించి ఒక్క పదంలో చెప్పండి. లెజెండ్ ✦ మన సినిమా ఇండస్ట్రీపై కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది? లాక్‌డౌన్ తరవాత ఇదొక డిఫరెంట్ వరల్డ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? అవును, లాక్‌డౌన్ పూర్తిగానే ఇదొక కొత్త ప్రపంచం అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, కోవిడ్ 19 ప్రభావం ప్రతి ఇండస్ట్రీపై ఉంటుంది. ప్రభుత్వ ఆంక్షల కన్నా మనకు మనం జాగ్రత్తలు పాటించడమే పెద్ద పాత్ర పోషిస్తుంది. ✦ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి. అసలైన నాయకుడు ✦ సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా ప్రాంక్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తారు? రానా దగ్గుబాటి


from https://ift.tt/2yf07mE

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages