SAVE THE WORLD: ఏమిటి నీ సమాధానం? అంటూ రంగంలోకి దిగిన కోటి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 12 April 2020

SAVE THE WORLD: ఏమిటి నీ సమాధానం? అంటూ రంగంలోకి దిగిన కోటి

ప్రపంచమంతా కల్లోలంలో చిక్కుపోయింది. చైనా నుంచి దేశ విదేశాలకు పాకిన ఈ మహమ్మారి లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం 210 కి పైగా దేశాలను ఈ వైరస్ గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అశేష ప్రజానీకాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తున్నాయి. లాక్‌డౌన్ అమలు చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలకు తగు సూచనలిస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు కరోనాపై ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పిస్తున్నారు. పాటలు, వీడియోల రూపంలో అందరినీ చైతన్య పరుస్తూ ధైర్యం నింపుతున్నారు. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ .. ‘సేవ్ ద వరల్డ్’ పేరుతో ఓ పాటను రూపొందించి విడుదల చేశారు. ఈ పాటలో ప్రకృతిని కాపాడుకోకుంటే జరిగే నష్టాలను వివరిస్తూ 'ఏమిటి నీ సమాధానం?' అంటూ చైతన్య పరిచారు. శ్రీనివాస మౌళి అందించిన లిరిక్స్‌పై కొడుకు రోషన్‌తో కలిసి ఈ పాటను స్వరపరిచారు కోటి. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పరిసరాల పరిశుభ్రత అవసరాన్ని గుర్తుచేస్తూ సాగిన ఈ పాట అందరి మెప్పు పొందుతోంది. గతంలో కూడా కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లతో ఓ పాట రూపొందించి భేష్ అనిపించుకున్నారు కోటి. ఈ సాంగ్ చూసి భారత ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో కోటి ఇలా తన పాటలతో చైతన్యం తీసుకొస్తుండటం నిజంగా అభినందనీయం.


from https://ift.tt/2K2xSdc

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages