మహేష్ దూకుడికి బ్రేక్స్ వేసిన కరోనా - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

మహేష్ దూకుడికి బ్రేక్స్ వేసిన కరోనా

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్య మామూలు ఫామ్‌లో లేరు. ఏకంగా హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు కాస్త స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఎంచుకునే మహేష్ ఈమధ్య కాలంలో వరుసగా ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’.. లేటెస్ట్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. పైగా సినిమా సినిమాకి అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ‘భరత్ అనే నేను’ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ‘మహర్షి’ బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నారు వంశీ పైడిపల్లి. దాంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ‘మహర్షి’ ఫినిష్ అయ్యాక సుకుమార్‌తో సినిమా అనుకున్నారు మహేష్. కానీ అప్పుడు అనుకోకుండా జరిగిన పరిణామాలతో అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేసి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం అనుకోకుండా గ్యాప్ వచ్చింది. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ అవ్వగానే వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ, వంశీ స్క్రిప్ట్ లేట్ అయ్యింది. ఇప్పటికి అయితే సరైన పాయింట్ సెట్ అయ్యి స్క్రిప్ట్ మొదలయ్యింది అంటున్నారు. అయితే, ఈ గ్యాప్‌లో మహేష్.. పరశురామ్ సినిమాని ఫైనల్ చేసారు. మహేష్ ఎన్ని సార్లు మార్పులు చెప్పినా ఓపికగా చేసి, చివరికి తన స్క్రిప్ట్‌ని ఓకే చేయించుకున్నారు పరశురామ్. 14 రీల్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. ఇక హీరోయిన్‌గా రష్మికని పరశురామ్ సూచించగా మహేష్ మాత్రం కియారాని ప్రిఫర్ చేసినట్టు సమాచారం. ఒకవేళ కియారా కాకపోయినా హిందీ రైట్స్‌ని దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ హీరోయిన్‌నే తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అయితే, ఈ లోగా త్రివిక్రమ్‌తో నమ్రత సెట్ చెయ్యాలి అనుకున్న ప్రాజెక్ట్, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ లైన్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఈ సినిమా అయ్యేలోపు రాజమౌళి RRR కంప్లీట్ చేసుకుని వస్తే మహేష్ మిగతావన్నీ పక్కనబెట్టి అటు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మహేష్ రెడీ, కథ రెడీ, డైరెక్టర్ రెడీ.. కరోనా కంట్రోల్ అయితే సెట్స్ మీదకి వెళ్ళడమే తరువాయి. మొత్తానికి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మహేష్ స్పీడ్‌కి కరోనా బ్రేక్స్ వేసినట్టయ్యింది.


from https://ift.tt/3b6Tsc6

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages