ఆ పేరు కలిసేలా... కొడుకుకు పేరు పెట్టుకున్న అనిల్ రావిపూడి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

ఆ పేరు కలిసేలా... కొడుకుకు పేరు పెట్టుకున్న అనిల్ రావిపూడి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ బంద్ కావడంతో తారలంతా ఇంటి పనుల్లో బిజీ అయ్యారు. అటు దర్శకులు మాత్రం ఇదే మంచి సమయం అంటూ... మంచి కథల్ని రాసుకుంటున్నారు. త్వరలో తీయనున్న సినిమాలకు సంబంధించిన కథను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావపూడి... తన కొత్త సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఓ పత్రికకు ఇంటర్య్వూ ఇచ్చాడు అనిల్. ఈ సందర్భంగా అనేక విషయాల్ని తెలిపాడు. మహేష్ తో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీనే అన్నాడు అనిల్. ఆయనిచ్చిన అవకాశంతోనే సరిలేరు నికెవ్వరుతో దర్శకుడిగా మరో స్థాయికి చేరానన్నాడు. ఆ సినిమా సమయంలోనే తనకు బాబు పుట్టాడని... అందుకే ఆ సినిమాలో హీరో పేరును కలుపుతూ అజయ్ సూర్యాన్ష్ అనే పేరు పెట్టుకున్నాని తెలిపాడు. అనిల్ ఇలాంటి సినిమాలే చేస్తాడు అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేస్తాడనేలా నా ప్రయాణం ఉండబోతుందన్నాడు. అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే ఇంట్లో సంబరాలు జరిగాయి. అనిల్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు రూపంలో తనకు సినిమా రిలీజ్‌కు ముందే అతి పెద్ద గిఫ్ట్‌ వచ్చిందని అనిల్ అప్పట్లో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.


from https://ift.tt/2UZVbdS

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages