బన్నీ సినిమా‘పుష్ప’లో విలన్‌గా బాలీవుడ్ హీరో ? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 10 April 2020

బన్నీ సినిమా‘పుష్ప’లో విలన్‌గా బాలీవుడ్ హీరో ?

అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’ చేస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ విజయ్ సేతుపతి కాదని తెలుస్తోంది. అతడు పోలీస్ ఆపీసర్‌గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. దీంతో విలన్‌గా బాలీవుడ్‌కు చెందిన హీరోను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం సంజయ్ దత్ .. జాకీ ష్రాఫ్ .. సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నారట. ఈ ముగ్గురిలో ఒకరిని ఆయన ఫిక్స్ చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు ఇప్పటికే టాలీవుడ్ సినిమాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. జాకిష్రాఫ్, సునీల్ శెట్టి, అజయ్ దేవగణ్ వంటి హీరోలు తెలుగులో నటిస్తున్నారు. ఇప్పుడు బన్నీ కొత్త సినిమాలో కూడా బాలీవుడ్‌కు చెందిన హీరోను తీసుకోవాలన్న ఆలోచలనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అతడి బర్త్ డే సందర్భంగా మూవీ యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి పుష్ప అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ‌ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్టులుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా టైటిల్ ఫాంట్ నుంచి బన్నీ లుక్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఆరోజంతా ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కలపదొంగగా బన్నీ కనిపించనున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బన్నీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు.


from https://ift.tt/3c4GziQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages