ప్రముఖ టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. శాంతి మరణంతో పలువురు టీవీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
from https://ift.tt/34nJiRW
No comments:
Post a Comment