హీరోయిన్‌కి ఘాటు ముద్దిస్తూ క్లోజ్.. పూరి జగన్నాథ్ పక్కా ప్లాన్! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

హీరోయిన్‌కి ఘాటు ముద్దిస్తూ క్లోజ్.. పూరి జగన్నాథ్ పక్కా ప్లాన్!

ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా ఆలోచిస్తూ మాస్ మసాలా సినిమాలు రుపొందించడంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ది అందెవేసిన చేయి. ఆయన సినిమాల్లో రొమాంటిక్ కిక్ పుష్కలంగా ఉండేలా చూసుకునే పూరి.. తాను నిర్మిస్తున్న సినిమాలోనూ అదే ఫాలో అవుతున్నారు. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రొమాంటిక్' సినిమా కోసం పూరి జగన్నాథ్ పక్కా ప్లాన్ వేశారని తెలుస్తోంది. పేరుకు తగ్గట్టుగా సినిమా లాస్ట్ సీన్ కూడా రొమాంటిక్ కిక్కివ్వాలని చూస్తున్నారట. స్టార్టింగ్ సీన్ మొదలుకొని చివరి సీన్ వరకూ ఆద్యంతం ఆసక్తి రేపుతూ రసిక ప్రియులను రంజింపజేయడం ఒక్క పూరీకే చెల్లుతుంది. ఈ నేపథ్యంలో తన కొడుకు సినిమా కూడా నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావాలని, అన్ని సినిమాలతో పోల్చితే ఈ సినిమా భిన్నంగా ఉండాలని ఆలోచన చేసిన ఆయన.. క్లైమాక్స్‌లో హీరోయిన్‌కి హీరో లిప్ టు లిప్ కిస్ ఇచ్చి ముగించాలని ప్లాన్ చేశారట. ఈ మేరకు డైరెక్టర్ అనిల్ పాదూరికి ఆ సీన్ ప్రాధాన్యత ఎలా ఉంటుందనేది వివరించి ఆయనతో ఓకే చేయించారట. ఛార్మి, పూరిజగన్నాథ్ సంయుక్త సమర్పణలో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఈ 'రొమాంటిక్' మూవీని రూపొందిస్తున్నారు. చిత్రంలో ఆకాష్ పూరి సరసన అందాల భామ హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ, మందిరా బేడీ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లేలా మేజర్ పార్ట్ షూటింగ్ గోవాలో పూర్తిచేశారు. కొడుకు ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కివ్వాలనే కోణంలో ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు పూరి. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకున్నాయి. అతిత్వరలో చిత్రాన్ని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from https://ift.tt/3bbzI7m

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages