సుఖంగా ఉంది.. ఎప్పుడూ అదేపని అంటూ వీడియో పెట్టిన ఛార్మి.. జాగ్రత్త మేడమ్!! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

సుఖంగా ఉంది.. ఎప్పుడూ అదేపని అంటూ వీడియో పెట్టిన ఛార్మి.. జాగ్రత్త మేడమ్!!

కరోనా కల్లోలానికి కళ్లెం వేసేందుకు దేశమంతా ఒక్కటైంది. మాయదారి మహమ్మారిని తరిమికొట్టాలని అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్, పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా గడపదాటి అడుగు బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సినీ నటి, నిర్మాత మాత్రం సీజన్ ఫ్రూట్ అయిన మామిడి పళ్ళు తింటూ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. మామిడిపండు తింటూ టిక్ టాక్ వీడియో చేసిన ఛార్మి.. ఇవి తింటుంటే సౌకర్యంగా హాయిగా ఉందని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు సదరు వీడియో పోస్ట్ చేస్తూ 'ఈట్ ఎన్ ఈట్ ఎన్ ఈట్' అంటూ స్మైలింగ్ ఎమోజీలను ట్యాగ్ చేసింది. అంతేకాదు ఈ లాక్‌డౌన్‌లో అందరూ ఇంట్లోనే ఉండండి అని పేర్కొంది. ఛార్మి పెట్టిన ఈ ట్వీట్ చూసి ''జాగ్రత్త మేడమ్, ఇంకా బొద్దుగా అవుతారు, మామిడి పండ్లు మీకెక్కడ దొరికాయి మేడమ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకప్పుడు హీరోయిన్‌గా తన అందచందాలను ఆరబోస్తూ ఓ ఊపు ఊపేసిన ఛార్మి.. ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగమవుతోంది. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ హిట్ రాబట్టి లాభాలు గడించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' మూవీ రూపొందిస్తున్నారు. ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో రొమాంటిక్ డోస్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ నుంచి బయటకొచ్చిన పిక్స్ ద్వారా తెలుస్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.


from https://ift.tt/2XF23z9

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages