ప్రభుదేవ టాటూను చెరిపేసుకున్న నయనతార .. ఫోటోలు వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

ప్రభుదేవ టాటూను చెరిపేసుకున్న నయనతార .. ఫోటోలు వైరల్

లేడీ సూపర్ స్టార్ నయతనతార. తెలుగు, తమిళ్‌లో అగ్రహీరోలందరితో నటిస్తూ.... మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సౌతిండియా టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తోంది. ప్రేమ విషయంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. అయితే నయన్ ప్రియుడు వార్తలతో ఎప్పడూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. అయితే అంతకుముందు నయనతార శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపింది. ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు అతడి పేరును ఎడమ చేతిపై టాటూ వేయించుకుంది. అయితే ఇప్పుడా పేరు మాయమైంది. తాజాగా, 'ప్రభుదేవా' అన్న పేరుండాల్సిన చోట 'పాజిటివిటీ' అన్న అక్షరాలను నయన్ వేయించుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రభుదేవా మాజీ భార్య కూడా నయనతార, ఎఫైర్ పై స్పందించింది. నయనతార వల్లే తన బతుకు రోడ్డున పడిందని ప్రభుదేవ మాజీ భార్య ఆరోపించింది. ఆమె కారణంగానే తన భర్త తనకు 2011లో విడాకులు ఇచ్చాడని చెబుతుంది. ప్రభుదేవా కుమారుడు క్యాన్సర్ వ్యాధితో 2008లో చనిపోయాడు. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ప్రభుదేవా 1995లో రమాలత్ అనే ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకుంది రమాలత్. 15 ఏళ్ళపాటు వీరి సంసారం సజావుగానే సాగింది . నయనతార .. ప్రభుదేవాకి దగ్గరయ్యాక దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయని రమాలత్ చెప్పుకొచ్చింది. తానంటే ప్రాణమిచ్చే భర్తను తనకు కాకుండా చేసిన నయనతార అంతకంత తన జీవితంలో అనుభవిస్తుందని శాపనార్థాలు కూడా పెట్టింది. అంతకుముందు తమిళ హీరో శింబుతో లవ్ లో పడిన నయన్, బ్రేకప్ తరువాత, ప్రభుదేవాకు దగ్గరైంది. వీరిద్దరికీ పెళ్లి ఖాయమని కూడా వార్తలు వినిపించాయి. కానీ, ఆ ప్రేమ కూడా వర్కవుట్ కాలేదు. ఇక ప్రస్తుతం నయన్, విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో వుంది. చానాళ్ల నుంచే వీరి ప్రేమ కొనసాగుతోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న చిత్రాలు నెట్టింట కొన్ని వందలు దర్శనమిస్తున్నాయి.


from https://ift.tt/2K61lmo

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages