రోజా ఫిష్ ఫ్రై, గుత్తి వంకాయ.. నగరి ఎమ్మెల్యే టుడే స్పెషల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 4 April 2020

రోజా ఫిష్ ఫ్రై, గుత్తి వంకాయ.. నగరి ఎమ్మెల్యే టుడే స్పెషల్

స్టేహోమ్ స్టే సేఫ్ అంటూ ఇంటికే పరిమితం అయిన నగరి ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి రోజా తన చేతి వంటతో ఘుమఘుమలాడిస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలు, టీవీ షోలతో బిజీబిజీగా ఉన్న రోజా ఒకవైపు తన నగరి నియోజక వర్గంలో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ ఘుమఘుమలాడిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా డ్యూటీలు చేస్తున్న పోలీస్‌లకు స్వయంగా వంట చేయిస్తూ తన వంతు బాధ్యత నెరవేరుస్తున్న రోజా.. ఇంట్లోనూ రకరకాల వంటలు చేస్తూ నోరూరిస్తోంది. మొన్న చికెన్‌తో ఘుమఘుమలాడించిన రోజా.. వెరైటీ వంటకాలతో టేస్ట్ చూపిస్తున్నారు. తాజాగా బీట్రూట్ చట్రీ, గుత్తివంకాయ కూరతో పాటు చేపల ఫ్రై చేస్తూ వీడియో వదిలారు. పెనం పైన చేప ముక్కలకు మసాలా అద్దుతూ.. ‘మాలాంటి ఆర్టిస్ట్‌లు, పొలిటీషియన్లు, ఉద్యోగం చేసేవాళ్లకు కాస్త విరామం దొరికింది. కరోనా వచ్చిందనే బాధ ఉంది కాని.. పిల్లలతో, భర్తతో హ్యాపీగా ఉంటూ వాళ్లకు మనమే స్వయంగా వండిపెట్టుకునే అవకాశం లభించింది. అందరూ రెస్ట్ తీసుకుంటున్నా.. మహిళలకు మాత్రం ఇంట్లో ఉన్నా రెస్ట్ ఉండదు.. కాని ఇది కూడా మాకు సంతోషమే. మా పిల్లలకు ఇష్టమైన ఫిష్ ఫ్రై, టమోటా కర్రీ, క్యారెట్ ఇవన్నీ కూడా చేశా. గతంలో స్వాతంత్ర్యంకోసం యుద్దాలు చేశారు.. ఇప్పుడు మన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఇంట్లో ఉండండి చాలు’ అంటూ గరిటెతిప్పుతూ ఫిక్ కర్రీ సందేశం ఇచ్చారు రోజా.


from https://ift.tt/2XfkEBH

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages