స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ పుట్టినరోజును పురష్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. అలాగే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ రగ్డ్ లుక్‌లో అదరగొట్టారు. మాసిన మీసం, గెడ్డం, సీరియస్‌గా బన్నీ లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే, ఆయన వేసుకున్న షర్ట్ కూడా పాత స్టైల్లో ఉంది. అంటే, ఇది కూడా ‘రంగస్థలం’ మాదిరిగా 1980ల కాలంలో సాగే కథ కావచ్చు. ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
from https://ift.tt/34ooxps
No comments:
Post a Comment