అల్లు అర్జున్ బర్త్ డే.... నువ్వు బాగుండాలబ్బా అంటూ చిరు ట్వీట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 7 April 2020

అల్లు అర్జున్ బర్త్ డే.... నువ్వు బాగుండాలబ్బా అంటూ చిరు ట్వీట్

గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరో . ఆర్య సినిమాతో అదరగొట్టాడు. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. మాస్ డైలాగ్స్ మాట్లాడాలంటే ఎవరైనా మనోడి తర్వాత. అప్పట్లో బన్నీ తీసిన దేశ ముదురు సినిమా బాక్స్ ఫీస్ వద్ద బిగ్ హిట్‌గా నిలిచింది అంతేకాకుండా 'వేదం' , 'రుద్రమదేవి' వంటి మల్టీస్టారర్ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించి అందరితో ప్రశంసలు అందుకున్నాడు. రుద్రమదేవిలో బన్నీ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర అందరికీ గుర్తుంటే ఉంటుంది. సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు కూడా మంచి టాక్ అందుకున్నాయి. ఇక డాన్స్ అంటే బన్నీకి ప్రాణం. ఎలాంటి స్టెప్పులైనా అవలీలగా వేసేస్తాడు. పాటకు తన స్టెప్పులతో మరింత ప్రాణం పోస్తాడు. బన్నీకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ముందుగా మెగాస్టార్ డాడీ సినిమాలో మెరిసిన బన్నీ డాన్స్ స్టూడెంట్‌గానే కనిపిస్తాడు. ఇవాళ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. డాన్స్‌లో చిన్న వయసు నుంచి బన్నీకి గ్రేస్ ఉందన్నారు చిరు. బన్నీలో కసి, కృషి తనకు చాలా ఇష్టం అన్నారు. హ్యాపీ బర్త్ డే బన్నీ నువ్వు బాగుండాలబ్బా... అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. బన్నీతో కలిసి దిగిన చిన్న నాటి ఫోటోను కూడా మెగాస్టార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచనల విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.


from https://ift.tt/2V9ELhL

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages