హీరోతో రెండో పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరోయిన్ ? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 8 April 2020

హీరోతో రెండో పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరోయిన్ ?

ఆరేళ్ల కిందట వచ్చిన టెన్త్ క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . ఆ తర్వత ఆమెకు పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు.దీంతో తమిళం వైపు మొగ్గు చూపింది. అక్కడ సినిమా ఛాన్సులు బాగానే వచ్చినా పేరు మాత్రం రాలేదు. ఈలోపే అక్కడున్న ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ హీరోకి ఇదివరకే పెళ్లి కూడా అయ్యింది. ఆ తర్వాత అతడు భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ఇప్పుటు సునైనతో ప్రేమలో పడ్డాడు. దీంతో ఇద్దరిపై అనేక రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు వీరిద్దరూ. సునైన ప్రేమించింది ఎవరో కాదు తమిళ హీరో కృష్ణ కులశేకరన్. పంజా దర్శకుడైన విష్ణువర్ధన్ సోదరుడు. 2016లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు కృష్ణ సునైనాతో ప్రేమయాణం నడిపాడు. సునైనా ప్రేమలో ఉన్నట్లు కొన్ని తమిళ్ మీడియాలో కథనాలు రావడంతో ఆమె ఇంట్లో వాళ్లు అడ్డు తగిలారు. హీరోకు ఇదివరకే పెళ్లి కావడంతో ఆమె కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అతడు హీరో అయినప్పటికీ పెళ్లి అయ్యి విడాకులు కూడా తీసుకోవడం వారికి నచ్చలేదు. రెండో పెళ్లివాడితో ప్రేమ ఏంటని నిలదీశారు. దీంతో సునైన కుటుంబసభ్యులకు నచ్చచెప్పింది. దీంతో చివరకు ఈ వ్యవహారానికి చెక్ పెట్టేందుకు సునైనా - కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. అసలైతే ఏప్రిల్ లొనే పెళ్లిపీఠలెక్కలని అనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా పెళ్లి నిర్ణయం కాస్త పోస్ట్ పోన్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్‌‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీ విష్ణుతో 'రాజా రాజా చోళ' అనే సినిమాలో సునైన నటిస్తోంది.


from https://ift.tt/2RpO3VM

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages