పుష్ప టైటిల్‌ను ఐదునెలల ముందే రిలీజ్ చేసిన బన్నీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 8 April 2020

పుష్ప టైటిల్‌ను ఐదునెలల ముందే రిలీజ్ చేసిన బన్నీ

సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ తీస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’. తాజాగా బుధవారం బన్నీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో నిన్న అంతా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్టైలిష్ స్టార్ కనిపించాడు. నిన్న మరో ముగ్గురు బర్త్ డేలు ఉన్నా వాళ్లందరికీ వెనక్కి నెట్టి.... ట్రెండింగ్‌లో నిలిచాడు. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. గతేడాది నవంబర్‌లోనే బన్నీ ఈ సినిమా పేరును బయట పెట్టాడన్న మరో వార్తపై ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. 2019 న‌వంబ‌ర్ 27న సుకుమార్‌ని ఉద్దేశిస్తూ బ‌న్నీ చేసిన ట్వీట్‌ను సాక్షంగా చూపుతున్నారు నెటిజన్స్. అల్లు అర్జున్ టైటిల్ అప్పుడే చెప్పేశాడు. మనమే గుర్తించలేకపోయామంటూ తెగ బాధపడిపోతున్నారు. 2019 న‌వంబ‌ర్ 27న బన్నీ ట్వీట్ చూస్తే.... ‘సుక్కు జుట్టు రంగు మారింది. నా స్కిన్ కలర్ మారింది. కానీ ప్రేమ మాత్రం మారలేదు. మేం కలుసున్నప్పుడు ఏదీ మారదు. మీరు త్వరలోనే దీనికి సాక్షుల‌వుతారు’’ అనే మెసేజ్‌తో పాటు పక్కనే ‘పుష్ప’ అనే టైటిల్‌ను డిఫ‌రెంట్‌గా పోస్ట్ చేశారు బ‌న్నీ. ఆ టైటిల్‌లో కొన్ని జోడియక్ సైన్స్‌ని కూడా వాడాడు. కానీ అభిమానులు, ప్రేక్ష‌కులే మాత్రం ఈ విషయాన్ని గమనించలేకపోయారు. ఇప్పుడు సినిమా టైటిల్ పుష్ప అని తేలడంతో అప్పటి బన్నీ ట్వీట్ కూడా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రంగా సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రష్మిక బన్నీకి జంటగా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్‌గా అలరించనున్నారు. ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడంతో బ‌న్నీ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.


from https://ift.tt/2JNsR8b

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages