అందుకే రామ్ చరణ్ నా దృష్టిలో.. భర్తపై ఉపాసన కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 16 April 2020

అందుకే రామ్ చరణ్ నా దృష్టిలో.. భర్తపై ఉపాసన కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఆయన భార్య చేసిన కామెంట్స్ మెగా అభిమాన వర్గాన్ని హుషారెత్తిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మెగా ముచ్చట్లను, సామాజిక అంశాలను అభిమానులతో పంచుకునే ఉపాసన.. ఈ సారి వంటగదిలో గరిటె తిప్పుతున్న వీడియో షేర్ చేసి అట్రాక్ట్ చేసింది. అంతేకాదు ఈ విషయాన్ని భర్తలందరూ గమనించాలంటూ ట్యాగ్ చేసింది మెగా కోడలు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా కట్టడిలో భాగంగా దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తూచాతప్పకుండా పాటిస్తూ హోమ్ క్వారంటైన్ ఎంజాయ్ చేస్తున్నారంతా. ఈ నేపథ్యంలోనే షూటింగ్స్ అన్నీ బంద్ చేసుకొని దాదాపు నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న రామ్ చరణ్.. తన భార్యామణి ఉపాసనకు వంట చేసి పెడుతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. ''నా కోసం రామ్ చరణ్ వంట చేసిన వేళ.. వండటమే కాదు అంట్లు కూడా తోమాడు. అందుకే ఆయన నా దృష్టిలో రియల్ హీరో'' అంటూ లవ్ ఎమోజీలను ట్యాగ్ చేసింది ఉపాసన. Also Read: మెగా దంపతుల ఈ అన్యున్య దాంపత్యం, సరదా క్షణాలు చూసి మెగా అభిమానలోకం ఖుషీ అవుతోంది. 'చిరులా వున్నాడు మా లిటిల్ బాస్, సూపర్, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు సూపర్' అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వీడియో దర్శనమిస్తోంది. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ షేర్ చేసుకుంటున్నారు రామ్ చరణ్ అభిమానులు. ప్రస్తుతం రామ్ చరణ్ RRR మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి రూపొందిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనేది జక్కన్న టార్గెట్. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోతున్న 'ఆచార్య' సినిమాలోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు చెర్రీ.


from https://ift.tt/3eqjDNi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages