మనం నడిచే దారి నీతిబద్ధంగా ఉండాలి.. చిరంజీవి చెప్పింది అదేనా! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 16 April 2020

మనం నడిచే దారి నీతిబద్ధంగా ఉండాలి.. చిరంజీవి చెప్పింది అదేనా!

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఇళ్లలో రకరకాల పనులు చేయడం చూస్తున్నాం. ఇప్పటి వరకు వెండితెరపై హీరోల డ్యాన్సులు, ఫైట్లు చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇళ్లలో వారు భార్యలకు సహాయం చేయడం, వంటలు చేయడం చూస్తున్నారు. నిజానికి ఈ క్వారంటైన్ పీరియడ్‌లో మన హీరోలు కూడా ఈ పనులను కాలక్షేపం కోసం చేస్తున్నారు. అంతేకాదు, ఈ సమయంలో మనం ఇళ్లలో ఏం చేయొచ్చో చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇంట్లో తన పనులు తానే చేసుకుంటున్నారు. ఉదయానే వర్కౌట్స్ అనంతరం తాను మొక్కలను తడుపుతుంటానని ఇప్పటికే చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే, తాజాగా చిరంజీవి ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో తన ఇంటి ముందు పలకలతో ఏర్పాటుచేసిన మార్గాన్ని ఆయన శుభ్రపరుస్తున్నారు. పలకల మధ్య ఉన్న ఖాళీల్లో మట్టిచేరుతుంది కాబట్టి వాటర్ స్ప్రేతో శుభ్రంగా కడుతుగున్నారు. అయితే ఈ ట్వీట్‌‌కు చిరంజీవి పెట్టిన క్యాప్షన్ ఆలోచింపజేస్తోంది. ‘మనం ఎంచుకునే మార్గాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని చిరంజీవి పేర్కొన్నారు. అయితే, ఆయన అన్నది కేవలం ఇంటి ముందు ఉన్న దారి గురించి కాదని అర్థమవుతోంది. మన జీవితానికి ముడిపెట్టి ఆయన ఈ మాట అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి జీవితంలో మనం ఎంపిక చేసుకునే మార్గాలు కూడా ఎప్పుడూ నీతిబద్ధంగా ఉండాలని చిరంజీవి చెప్పినట్టు స్పష్టమవుతోంది. పెద్దన్నయ్య చెబితే ఫ్యాన్స్ ఫాలో అవకుండా ఉంటారా.. అయిపోతారు. ఇంటి ముందు దారులే కాదు.. జీవితంలో తాము ఎంచుకునే మార్గాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతానికి చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.


from https://ift.tt/3bf6Via

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages