కుట్టు మిషన్‌పై మాస్క్‌లు కుడుతున్న చిరంజీవి తల్లి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 10 April 2020

కుట్టు మిషన్‌పై మాస్క్‌లు కుడుతున్న చిరంజీవి తల్లి

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో అనేకమంది జీవనం అస్తవ్యస్తం అయ్యింది. ముఖ్యంగా రోజువారీ కూలీల పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో అటు సినిమా ఇండస్ట్రీలో కూడా అనేకమంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రతీ ఒకరు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తల్లి సైతం ఈ యజ్ఞంలో భాగస్వామ్యులు అయ్యారు. మానవత్వాన్ని చూపుతూ ముందుకు వచ్చారు. మెగాస్టార్‌ అంజనాదేవి కరోనా కోసం మాస్కులు తయారు చేస్తున్నారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ సినీ కార్మికుల కోసం కోటి రూపాయులు సాయం చేశారు. రామ్ చరణ్ కూడా కరోనా కోసం తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళం అందించాడు. ఇలాంటి విపత్కర సమయంలో సినీతారలతో పాటు వారు కటుంబాలు కూడా సాయం చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కేంద్రమంత్రుల భార్యలు సైతం కరోనా కోసం మాస్కులు తాయరు చేస్తున్నారు. తన సతీమణి కావ్య మాస్కులు తయారుచేసి, వాటిని పంపిణీ చేసిన చిత్రాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తన సతీమణి సమయాన్ని సద్వినియోగం చేస్తూ, ఇంట్లోనే మాస్కులు తయారు చేసి, వాటిని అవసరం ఉన్నవారికి అందించారని తెలిపారు. ఈ ట్వీట్‌ను పలువురు రాజకీయ నేతలతో పాటు, సినీ సెలబ్రిటీలకు ట్యాగ్‌ చేశారు. ఇలాగే ప్రతి కుటుంబం తమకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.


from https://ift.tt/3caxsxj

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages