‘సల్మాన్.. నీకు మేం ఉరిశిక్ష విధించాం’: హీరోకు యూనివర్శిటీ నుంచి బెదిరింపులు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 24 September 2019

‘సల్మాన్.. నీకు మేం ఉరిశిక్ష విధించాం’: హీరోకు యూనివర్శిటీ నుంచి బెదిరింపులు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. పంజాబ్‌ యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తమ ఫేస్‌బుక్ పోస్ట్‌లో సల్మాన్‌కు ఉరిశిక్ష తప్పకుండా పడుతుందని ఓ పోస్ట్ పెట్టారు. ‘సల్మాన్.. భారతీయ చట్టం నుంచి నువ్వు తప్పించుకోగలవు అనుకుంటున్నావేమో. కానీ బిష్ణోయ్ సమాజ్, పంజాబ్ యూనివర్శిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ నీకెప్పుడో ఉరిశిక్షను ఖరారు చేసింది. నువ్వు మా కోర్టులో దోషివి. అమ్మాయిలను గౌరవించు. జంతువులను సంరక్షించు. డ్రగ్స్‌కి దూరంగా ఉండు. పేదలకు సాయం చెయ్’ అని ఆ పోస్ట్‌లో రాసుంది. అయితే కృష్ణజింకను చంపిన కేసులో ఈ నెల 27న సల్మాన్ జోధ్‌పూర్ న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు బెదిరింపులు రావడంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. సల్మాన్‌కు భద్రత కల్పించారు. ఈ పోస్ట్‌పై వెంటనే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. 1990ల్లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్ జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకను వేటాడారు. ఆ సమయంలో సల్మాన్‌తో పాటు బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రేలు కూడా ఉన్నారు. వీరికి కూడా జోధ్‌పూర్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ ఈ కేసులో సల్మాన్ ఒక్కరే దోషిగా తేలారు. జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌కు ఐదేళ్లు కారాగార శిక్ష వేసింది. ఒకరోజంతా సల్మాన్ రేప్ కేసులో దోషి అయిన ఆశారాం బాపుతో కలిసి జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజే బెయిల్‌పై బయటికి వచ్చారు. మళ్లీ ఇప్పటివరకు సల్మాన్ జైలుకి వెళ్లింది లేదు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన కావడంతో తనపై వేసి కేసును మరోసారి పరిశీలించి కొట్టివేయాలని సల్మాన్ జులైలో జోధ్‌పూర్‌కు చెందిన సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన వాదనలు ఈ నెల 27 వినిపించనున్నారు. ఒకవేళ 27న కోర్టుకు సల్మాన్ హాజరుకాకపోతే ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తారు. కొన్ని నెలల క్రితం లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ పోలీసుల సమక్షంలోనే సల్మాన్‌ను చంపుతానని బెదిరించాడు. దాంతో సల్మాన్ ఇంటి చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. 27న సల్మాన్‌ కోర్టుకు హాజరయ్యేటప్పుడు కూడా భారీ భద్రతను ఏర్పాటుచేస్తామని డీసీపీ ధర్మేంద్ర యాదవ్ తెలిపారు.


from https://ift.tt/2mAWO2I

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages