RGV: పుష్పను సాకుగా చూపుతూ సెటైరికల్ ట్వీట్.. నెట్టింట రచ్చ రచ్చ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 22 December 2021

RGV: పుష్పను సాకుగా చూపుతూ సెటైరికల్ ట్వీట్.. నెట్టింట రచ్చ రచ్చ

టాలెంట్ సంగతి అటుంచితే తన సినిమాలతో, ముక్కుసూటి మాటలతో వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. సమాజంలో జరిగే పలు విషయాలపై తన అభిప్రాయాలను చెప్పడానికి ఎప్పుడూ ముందుండే ఆర్జీవీ తాజాగా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీల టాపిక్ తీస్తూ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ' ది రైజ్' దేశ వ్యాప్తంగా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. బన్నీ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో ఈ సినిమా హిందీ వర్షన్ కలెక్షన్స్‌పై ప్రతి ఒక్కరి దృష్టి పడింది. అయితే హిందీలో 'పుష్ప' సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు పోటీగా హాలీవుడ్ మూవీ `స్పైడర్ మ్యాన్ నో వే హోమ్` బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. దీంతో ఈ రెండు సినిమాలపై కన్నేసిన ఆర్జీవీ.. బాలీవుడ్‌పై సెటైరికల్ ట్వీట్ వదిలారు. ఎప్పటిలాగే తనదైన కోణంలో చిత్ర విచిత్రంగా మెసేజ్ ఇస్తూ పుష్ప సినిమాను సాకుగా చూపుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపై టాలీవుడ్ పంజా విసురుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. స్పైడర్‌మాన్, పుష్ప హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ.. హాలీవుడ్ వెనుక పరుగెడుతున్న బాలీవుడ్‌ని, టాలీవుడ్ వెంటాడుతోందని అర్థం వచ్చేలా మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక ఆర్జీవీ సినిమాల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `దిశ ఎన్ కౌంటర్` ఆధారంగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని `ఆశ ఎన్ కౌంటర్` పేరుతో జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.


from https://ift.tt/3pltMCb

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages