Rajamouli: జోరుమీదున్న RRR ప్రమోషన్స్.. ఎన్టీఆర్ క్రేజీ వీడియోతో మరో సర్‌ప్రైజ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 23 December 2021

Rajamouli: జోరుమీదున్న RRR ప్రమోషన్స్.. ఎన్టీఆర్ క్రేజీ వీడియోతో మరో సర్‌ప్రైజ్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన .. మరో బిగ్గెస్ట్ మూవీతో రంగంలోకి దిగబోతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా RRRని సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు రాజమౌళి. దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ హుషారెత్తేలా రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ రక్తి కట్టిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీం పాత్రలో నటించగా.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన RRR పోస్టర్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ యూ ట్యూబ్ రికార్డ్స్ షేక్ చేస్తోంది. ఇక సాంగ్స్ పరంగా చూస్తే ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను అలరిస్తూ గూస్ బంప్స్ తెప్పించగా.. తాజాగా నాలుగో పాల అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు జక్కన్న. కొమురం భీముడో.. అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తూ ఈ పూర్తి పాట డిసెంబర్ 24వ తేదీ (రేపు) సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కీరవాణి బాణీలు కట్టిన ఈ పాటను కాల భైరవ ఆలపించారు. ఈ ప్రోమో వీడియో సాంగ్‌పై ఆసక్తి నెలకొల్పింది. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించింది. అజయ్ దేవ్‌గన్, శ్రీయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు సహా యావత్ సినీ లోకం భారీ అంచనాలు పెట్టుకుంది.


from https://ift.tt/3ekYsgO

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages