పవన్ - మహేష్ మల్టీస్టారర్... పవన్ దంపతులకు థాంక్స్ చెప్పిన నమ్రత! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 24 December 2021

పవన్ - మహేష్ మల్టీస్టారర్... పవన్ దంపతులకు థాంక్స్ చెప్పిన నమ్రత!

ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ హ‌వా కొన‌సాగుతోంది. పాన్ ఇండియా మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్‌లోనూ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే అభిమానులు మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదెవ‌రిదో కాదు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుల‌ది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌హేష్ బాబు బ‌య‌ట ఎక్క‌డా ఎక్కువ‌గా క‌లుసుకోరు కానీ, ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. క్రిస్మ‌స్ సమ‌యంలో మ‌హేష్‌కి ప‌వ‌న్ ఆయ‌న స‌తీమ‌ణి అన్నాలెజినోవా బ‌హుమ‌తులు పంపారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ ప‌వ‌న్ దంప‌తులకు అభినంద‌న‌లు తెలిపారు. న‌మ్ర‌త షేర్ చేసిన ఈ విష‌యంపై ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అటు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్స్ త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. ప‌వ‌న్ - మ‌హేష్ క‌లిసి మ‌ల్టీస్టారర్ మూవీలో న‌టించాల‌న్నారు. దీనికి న‌మ్ర‌త‌నే చొర‌వ తీసుకుని సాధ్య‌మ‌య్యేలా చూడాల‌ని కూడా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో కోర‌డం విశేషం. ప‌వ‌న్ - మ‌హేష్ క‌లిసి సినిమా చేస్తే, వ‌చ్చే బాక్సాఫీస్ రిసౌండ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఫ్యాన్స్ కోరిక‌ను న‌మ్ర‌త శిరోద్క‌ర్ ప‌ట్టించుకుని వారి మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌డానికి ముంద‌డుగు వేస్తారా? అనేది చూడాలి. ఇది వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన జ‌ల్సా చిత్రంలో ప‌వ‌న్ పాత్ర‌కు సంబంధిచిన బ్యాగ్రౌండ్ స్టోరిని మ‌హేష్ బాబు వాయిస్‌లో వినిపించేలా చేసి ఫ్యాన్స్ అంతులేని కిక్‌ను అందించారు త్రివిక్ర‌మ్‌. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబుల‌తో మ‌ల్టీస్టార‌ర్‌ను ఏ డైరెక్ట‌ర్ సాకారం చేస్తారో చూడాలి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్‌, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంతో బిజీగా ఉంటే మ‌రో వైపు మ‌హేష్ స‌ర్కారు వారి పాట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నారు.


from https://ift.tt/3ep5wZO

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages