ఆర్ధిక కష్టాల్లో కుటుంబం.. డబ్బు సాయం కోరిన నెటిజన్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్ వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, 28 December 2021

demo-image

ఆర్ధిక కష్టాల్లో కుటుంబం.. డబ్బు సాయం కోరిన నెటిజన్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్ వైరల్

Responsive Ads Here
photo-88558885
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఏ విషయాన్నైనా సామాజిక మాద్యమాల ద్వారా వ్యక్తపరచడం చాలా సులువైంది. మరీ ముఖ్యంగా ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య వారధిగా మారాయి. తమ మనసులోని మాటలను, రిక్వెస్ట్‌లను సెలబ్రిటీల ముందుకు తీసుకెళ్లడం సులభతరం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నెటిజన్ యాంకర్ కోరుతూ ట్వీట్ పెట్టాడు. దీనిపై ప్రదీప్ రియాక్ట్ అయిన తీరు ఆయన్ను వార్తల్లో నిలిపింది. బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్.. అప్పుడప్పుడు తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఆపదలో ఉన్న వారి పట్ల జాలి చూపిస్తూ చేతనైనంత సాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, కరోనా కారణంగా నాన్న చనిపోవడంతో ఆర్థికంగా కుంగి పోయామని తెలుపుతూ ఓ బీటెక్ విద్యార్ధి ట్వీట్ చేశాడు. ఈ మేరకు యాంకర్ ప్రదీప్‌ని ట్యాగ్ చేస్తూ సాయం కోరాడు. కరోనా కారణంగా నాన్న చనిపోవడంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తాను, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన సిస్టర్ చాలా కష్టాల్లో ఉన్నామని తెలిపిన నెటిజన్ మీ నుంచి కొంత డబ్బు సాయం కావాలని కోరాడు. తమ కుటుంబ పరిస్థితి ఎలా ఉందనే దానికి ప్రూఫ్ కూడా ఇస్తానని చెబుతూ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో మంచి మనసుతో ఆ కుర్రాడి పరిస్థితి అర్థం చేసుకున్న యాంకర్ ప్రదీప్.. ''నా శక్తి మేర సాయం చేస్తా బ్రదర్. నీ డీటెయిల్స్ పంపించి స్ట్రాంగ్‌గా ఉండు'' అని రిప్లై ఇచ్చారు. దీంతో ప్రదీప్ మంచి మనసుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ప్రదీప్‌ మాచిరాజు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా కల్లోల పరిస్థితుల్లో చాలా మంది రోజువారీ కార్మికుల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. ఒక నెలరోజుల పాటు తనకి తెలిసిన కార్మికులకు ఆర్థిక సాయం అందించారు.


from https://ift.tt/3qutOHf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages