ధ‌నుష్ ద్విభాషా చిత్రం టైటిల్ ఫిక్స్‌.. మోషన్ పోస్టర్ విడుదల - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 23 December 2021

ధ‌నుష్ ద్విభాషా చిత్రం టైటిల్ ఫిక్స్‌.. మోషన్ పోస్టర్ విడుదల

కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను గురువారం అధికారికంగా ప్ర‌క‌టించారు. తెలుగులో ‘సార్‌’, త‌మిళంలో ‘వాతి’ పేరుతో సినిమా రూపొంద‌నుంది. ఒక పీరియాడిక‌ల్ మూవీ. గురువారం ఈ సినిమా టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను నిర్మాత‌లు రివీల్ చేశారు. టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా "యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్" అని తెలియజేశారు. అలాగే ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌కారం ధ‌నుష్ ఒక జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్ను పాళీ క‌నిపిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఇటీవ‌ల‌ 'రంగ్‌దే' చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. విద్యావ్యవస్థపై ఈ మూవీ రూపొందే అవకాశం ఉంది. కేరళకు బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా న‌టిస్తున్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి త‌న‌దైన ముద్ర‌వేసిన‌ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేయనున్నారు. జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి. ఈ ద్విభాషా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ 2022 జ‌న‌వ‌రిలో మొద‌లవుతుంది. ఇది కాకుండా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా రూపొందనుంది. రీసెంట్‌గా విడుదలైన లవ్‌స్టోరితో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ మూవీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇది కూడా వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.


from https://ift.tt/3Eqz6se

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages