MAA Elections: దుమారం రేపిన హేమ వ్యాఖ్యలు.. చర్యలు తప్పవంటూ నరేష్ స్ట్రాంగ్ రియాక్షన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 9 August 2021

MAA Elections: దుమారం రేపిన హేమ వ్యాఖ్యలు.. చర్యలు తప్పవంటూ నరేష్ స్ట్రాంగ్ రియాక్షన్

గత కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనతంగా ఈ సారి 'మా' ఎన్నికల అంశం హాట్ టాపిక్ అయింది. ఈ సారి పోటీలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, , జీవిత, CVL నరసింహారావు ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబెర్స్‌ని ప్రకటించగా.. మంచు విష్ణు 'మా' ఎలక్షన్ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని దూసుకెళ్తున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు ఎంటరై తమ కార్యవర్గానికి చట్టబద్దత ఉన్నట్లేనని, ఎన్నికలు జరిగే వరకు గరిష్ఠంగా ఆరేళ్ల వరకు తమకే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నడుమ 'మా' అధ్యక్ష బరిలో నిలిచిన నటి హేమ నరేష్‌పై సంచనల వ్యాఖ్యలు చేసింది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ MAA నిధులను నరేష్ దుర్వినియోగం చేస్తున్నారని, ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న 5 కోట్లలో 3 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టేశారని హేమ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడాయన ఎలక్షన్స్ జరగకూడదని, అధ్యక్ష కుర్చీ దిగకూడదని ప్లాన్ చేస్తున్నట్లు ఆమె పేర్కొనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా హేమ చేసిన వ్యాఖ్యలపై నరేష్ రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని తెలుపుతూ ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తప్పవని అన్నారు. కరోనా దృష్ట్యా MAA ఎలెక్షన్స్ ఎప్పుడు పెట్టాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని, పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.


from https://ift.tt/3jEWr0W

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages