కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు యంగ్ హీరో నాగ శౌర్య. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా సినిమా ''. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సినిమా షూట్ చేస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్న యూనిట్.. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో 'దిగు దిగు దిగు నాగ' అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. నాగరాజుపై ప్రేమతో ఈ భజన గేయాన్ని పాడుకుంటారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాటను ఆ లైన్‌తోనే మొదలుపెట్టి, అదే బాణీలో సినిమా సాహిత్యాన్ని అల్లారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. 'కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా' లాంటి పదప్రయోగాలు ఉపయోగిస్తూ ఓ కుర్రమనసు కోరికతో పాడే ఈ కొంటె పాట బాగానే అట్రాక్ట్ చేస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు స్పెషల్ అసెట్ అయింది. అయితే ఈ సాంగ్ విషయమై కొంతమంది అభ్యంతరాలు చెప్పడం చూసాం. రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమో చూసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఈ భజన పాటను ఇలా ఓ హీరోయిన్‌కి అన్వయిస్తూ ఐటెం సాంగ్‌లా మార్చేయడం ఏంటని హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశం అయింది.
from https://ift.tt/3xmWMu4
No comments:
Post a Comment