ఏవేవో రాస్తున్నారు.. చట్టాన్ని పని చేయనివ్వండి.. మీడియాపై శిల్పా శెట్టి కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 2 August 2021

ఏవేవో రాస్తున్నారు.. చట్టాన్ని పని చేయనివ్వండి.. మీడియాపై శిల్పా శెట్టి కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్‌ను ఊపేస్తోన్న అంశం పోర్న్ రాకెట్. అందులో భర్త్ రాజ్ కుంద్ర వ్యవహారం, ఆయన భారిన పడ్డ ఎంతో మంది యువతుల చుట్టూ కొన్ని కథనాలు తిరిగితే.. ఇక శిల్పా శెట్టి, ఆమె సోదరి షమితా శెట్టి, ఫ్యామిలీ చుట్టూ కొన్ని కథనాలు తిరుగుతున్నాయి. గతంలో తన భర్త గురించి శిల్పా శెట్టి మాట్లాడిన మాటలు, వారి ఆస్థుల గురించి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. ఇలా మీడియాలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లెక్కలేనన్ని వార్తలు వస్తున్నాయి. భర్తతో శిల్పా శెట్టి గొడవ పడిందని, విచారణ సమయంలో ఏడ్చిందని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అలా తన మీద వస్తోన్న వార్తలపై శిల్పా శెట్టి పరువునష్టం దావా కేసులు వేశారు. అయితే వాటిని ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. అందులో పరువునష్టం అనేది ఏమీ లేదని, పోలీసులు ముందు జరిగిన వ్యవహారాలే మీడియా రాసిందని, మీ ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగినా కూడా అక్కడ పోలీసు అధికారులున్నారు.. విచారణ చేశారు.. అదే మీడియా కూడా రాసింది అంటూ శిల్పా శెట్టికి మొట్టికాయలు వేసింది. మీరు సెలెబ్రిటీలు కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువగా వస్తుంటాయి.. అలా అని వాటిని ఆధారంగా చేసుకుని మీడియా మీద ఆంక్షలు విధించలేమని కోర్టు తెలిపింది. ఇలా విసిగి వేసారిన శిల్పా శెట్టి తాజాగా ఓ పోస్ట్ చేశారు. ‘గత కొన్ని రోజులుగా నేను ఎన్నో అనుభవిస్తూ వస్తున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. ఎన్నెన్నో రూమర్లు, ఇంకెన్నో ప్రత్యేకమైన ఊహాగానాలు ఇలా మీడియా, నా శ్రేయోభిలాషులు మాట్లాడుకుంటున్నారు. ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు. రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. నన్నే కాకుండా నా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా నా అభిప్రాయాన్ని నేను చెప్పలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా ఈ కేసు విచారణలో ఉంది. అందుకే నేను కూడా ఏమీ మాట్లాడటం లేదు. కానీ నేను అన్నట్టుగా కొన్ని కామెంట్లు నాకు అంటగట్టి రాస్తున్నారు. సెలెబ్రిటీని కావడం వల్లే నా ఫిలాసఫీ ఒకటి ఉంటుంది.. ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేయకు. ఎవ్వరికీ కూడా వివరణ ఇచ్చుకోకు. ఇప్పటికీ ఇదే చెబుతున్నాను. నాకు పోలీసుల మీద, న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం చేయాల్సిన న్యాయ పోరాటం మేం చేస్తున్నాం. కానీ అప్పటి వరకు మీ అందరినీ చేతులెత్తి మొక్కుతున్నాను.. తెలిసీ తెలియని, సగం సగం తెలుసుకుని వార్తలను రాయకండి. నా వ్యక్తిగతం జీవితం, ఓ తల్లిగా పిల్లల కోసం అడుగుతున్నాను..తప్పుడు వార్తలు రాయకండి. ఓ బాధ్యతమైన పౌరురాలిగా.. కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఈ 29 ఏళ్లుగా జీవిస్తూ వచ్చాను. నా మీద నమ్మకం ఉంచండి.. మీ నమ్మకాన్ని వొమ్ము చేయను. ఇలాంటి కష్టకాలంలో నన్ను, నా వ్యక్తిగత జీవితం, నాకుండే ఆ హక్కును గౌరవించండి. మీడియానే ఈ కేసును పరిష్కరించాలని చూడొద్దు. చట్టాన్ని, న్యాయాన్ని పని చేయనివ్వండి అని శిల్పా శెట్టి వేడుకున్నారు.


from https://ift.tt/37e65lv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages