సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీపాద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటారు. ఆమె మహిళలపై జరిగే అన్యాయాలు, వివక్ష, అత్యాచారాలపై నిత్యం స్పందిస్తుంటారు. అలా ఆమె వేసే పోస్ట్‌లు ఎక్కువగా నెగెటివ్ కామెంట్లతో దాడికి గురవుతుంటాయి. ఇక ఆమెను నానా రకాల కామెంట్లతో ట్రోలింగ్ చేస్తుంటారు. బూతులతో చిన్మయిని నెటిజన్లు వేధిస్తుంటారు. తాజాగా ఆమె లక్నో గర్ల్ ఘటన మీద స్పందించారు. గత రెండు మూడు రోజులుగా లక్నో గర్ల్ అంటూ ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయి క్యాబ్ డ్రైవర్‌ను నడి రోడ్డు మీద చితకబాదిన ఘటన, దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కాసాగింది. ర్యాష్ డ్రైవింగ్ చేసి తనను బయటపెట్టాడనే ఆరోపణలతో ఆ యువతి నడి రోడ్డు మీద వీరంగమాడింది. సదరు క్యాబ్ డ్రైవర్‌ను కాలర్ పట్టుకుని వాయించింది. కారు అద్దాలను పగలగొట్టింది. ఆ యువతి ఇంత చేస్తున్నా కూడా పక్కన అందరూ వీడియోలు తీస్తూ బిజీగా ఉన్నారు కానీ వద్దని వారించలేదు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అలానే చోద్యం చూస్తూండిపోయాడు. దీనిపై భిన్న రకాల రియాక్షన్లు వచ్చాయి. కొందరు సదరు యువతి ధైర్యసాహసాలను మెచ్చుకుంటే.. ఇంకొందరు మాత్రం ఆమె మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మీద చిన్మయి స్పందించారు. ఆమె పెట్టిన పోస్ట్‌ల మీద మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. అలా ఎవరి మీద ఎవరు దాడి చేసినా కూడా తప్పేనని, ఆ అమ్మాయి కూడా తప్పుగానే ప్రవర్తించిందని చిన్మయి చెప్పుకొచ్చారు. కానీ చిన్మయి వేసిన పోస్ట్‌ల మీద వస్తోన్న నెగెటివ్ కామెంట్లు, ఇలాంటి ఘటనల్లో అమ్మాయిలకు వస్తోన్న మద్దతు, అబ్బాయిలకు వస్తోన్న మద్దతు గురించి చెప్పుకొచ్చారు. ఆనాడు జొమాటో కేసులోనూ అమ్మాయినే అందరూ నిందించారు.. ఆ అబ్బాయికి ఏమైనా అయిందా? అతని జాబ్ ఏమైనా పోయిందా? అని చిన్మయి ప్రశ్నించారు. మైనర్ బాలికను రేప్ చేసిన ఘటనలో అరెస్ట్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు.. ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. అతనికి మద్దతు కూడా లభిస్తోంది.. ఇక ఈ లక్నో ఘటనలోనూ అబ్బాయికే ఎక్కువ మద్దతు వస్తోంది.. ఆ అబ్బాయి జాబ్ ఏమైనా పోయిందా? లేదు కదా? అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. అయితే తన మీద ఫెమినిస్ట్ అంటూ కొందరు వేస్తోన్న పోస్ట్‌లు, అసభ్యకర పదజాలంతో చేస్తోన్న కామెంట్ల స్క్రీన్ షాట్లను కూడా చిన్మయి షేర్ చేశారు.
from https://ift.tt/2TRYOVl
No comments:
Post a Comment