న్యూడ్ వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్! విస్తుపోయే విషయాలు బయటపెట్టిన నటి.. పోలీస్ కేసు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 6 August 2021

న్యూడ్ వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్! విస్తుపోయే విషయాలు బయటపెట్టిన నటి.. పోలీస్ కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు షూట్ చేసి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలతో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు.. ఇప్పటికే శిల్పా శెట్టి సహా కొంతమందిపై విచారణ చేపట్టి కూపీ లాగే పనిలో ఉన్నారు. ఇంతలో ఓ నటి రాజ్ కుంద్రా బండారం బయటపెడుతూ పోలీస్ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రాజ్‌కుంద్రాపై కొందరు నటీమణుల నుంచి తీవ్ర ఆలోపణలు రాగా, తాజాగా మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండటం చర్చనీయాంశం అయింది. తన అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో విడుదల చేశారని ఆరోపిస్తూ ఆ నటి రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముంబై పోలీసుల ఎదుట ఆమె ఓపెన్ అయిందని, విస్తుపోయే నిజాలు బయటపెట్టిందని అంటున్నారు. ఇటీవల మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేసిన సదరు నటి నుంచి తాజాగా ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ స్వీకరించినట్లు సమాచారం. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకొని, ఆ దిశగా విచారణ చేపడుతున్నారట. రాజ్‌ కుంద్రా మంచి వ్యక్తి కాదని, తనకిచ్చిన మాట తప్పాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదు అనే షరతు ముందే పెట్టుకొని రాజ్‌కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని, అయితే తన ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. తీరా దాన్ని ఏ విధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని ఆ నటి ప్రధాన ఆరోపణ. ఓ స్నేహితుడి ద్వారా తనకు ఆ విషయం తెలిసి షాకయ్యానంటూ రాజ్ కుంద్రాపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బాధిత మహిళల నుంచి వస్తున్న ఫిర్యాదులతో రోజుకో మలుపు తిరుగుతుండటం గమనార్హం.


from https://ift.tt/37oTlsg

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages