ఆ పని చేస్తూ భజ గోవిందమా..? పోలీసుల ఎంట్రీతో దర్శకుడి క్షమాపణ.. సీన్ లోకి కరాటే కళ్యాణి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 3 August 2021

ఆ పని చేస్తూ భజ గోవిందమా..? పోలీసుల ఎంట్రీతో దర్శకుడి క్షమాపణ.. సీన్ లోకి కరాటే కళ్యాణి

సినిమాల్లో సన్నివేశాలు, టీజర్, ట్రైలర్స్‌లో చూపించే సీన్స్ కొన్ని సందర్భాల్లో ఆ చిత్ర దర్శక నిర్మాతలకు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఓ చిన్న సినిమా '' సినిమా విషయంలో అదే జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ సినిమా దర్శకనిర్మాతలకు షాకిచ్చారు. దీంతో ఆ మూవీ దర్శకుడు క్షమాపణ చెప్పడం, ఈ ఇష్యూ లోకి ఎంటర్ కావడంతో సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు.. ఈ సినిమా టైటిల్ చూస్తేనే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది కదూ! టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌లో రొమాంటిక్ సీన్స్ చూపించి పిచ్చెక్కించారు మేకర్స్. షార్ట్ టర్మ్ రిలేషన్స్, రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ నేటితరం ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేస్తూ సినిమాపై హైప్ పెంచేసుకున్నారు. అయితే ఇందులోని ఓ శృంగార సన్నివేశంలో 'భజ గోవిందం' అనే పాట బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుండటం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆన్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు రావడంతో.. దీనిపై 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పలు హిందూ సంఘాలు ఈ సినిమాపై దర్శక నిర్మాతలపై దాడి ప్రారంభించాయి. అలాంటి సన్నివేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే అలాంటి అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ మూవీ డైరెక్టర్ యుగంధర్ స్పందిస్తూ.. తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. అది కావాలని చేసింది కాదని, ఈ సినిమాలో ఉన్న ఇంకొక పాటలోని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ తీసుకొచ్చి, ట్రైలర్‌లో రాంగ్‌ ప్లేస్‌లో పెట్టడం వల్ల ‘భజగోవింద’ అనే మాట ప్లే అయింది. అది నేనూ గమనించలేదు. అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో రచ్చ ఆగకపోవడంతో సినీ నటి కరాటే కళ్యాణి ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చింది. ''ఇది చుడండి ఇంత బహిరంగ క్షమాపణ అడిగినా వీళ్లు కేసులు వేస్తారు. పొద్దున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాల్ చేసి అందరికీ సారీ అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా మనకు వాళ్ళు విలువ ఇచ్చారు. అది కాపాడాలి. లేదా నేను ఏంటో చెప్పను చూపిస్తా. నిన్న వచ్చి సహకరించిన హిందువులు అందరికీ అభినందనలు. ఇది అందరి విజయం. నేను అరుస్తా అవసరం అయినప్పుడు మాత్రమే.. లేదా కార్యాసాదకురాలిగా ఉంటా.. జై శ్రీరామ్ జయ జయ శంకర'' అని పేర్కొన్న కరాటే కళ్యాణి ఆ తర్వాత ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో పాల్గొని దీనిపై వివరణ ఇచ్చింది. తప్పు జరిగిందని క్షమాపణ కోరాక ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని, సొంత గుర్తింపు కోసం కొంతమంది ఇలా చేస్తున్నారని చెబుతూ ఫైర్ అయింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కిస్తున్నారు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా.. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. చిత్రంలో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


from https://ift.tt/3zZCiJI

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages