Health: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే శ్రీరెడ్డి.. గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. కరెంట్ ఇష్యూస్‌తో పాటు.. హాట్ ట్రీట్‌తో ఫేస్ బుక్‌ని హీటెక్కించే శ్రీరెడ్డి తన ఫేస్ బుక్‌లో జూలై 12న చివరి పోస్ట్ పెట్టింది. అంతే దాదాపు నెల రోజులుగా ఆమె ఫేస్ బుక్‌లో పోస్ట్ లేకపోవడంతో పాటు.. ఆమె యూట్యూబ్ ఛానల్‌లో కూడా సైటెంట్ అయిపోయారు. కత్తి మహేష్ మరణించినప్పుడు దిగ్భాంతి వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఆ తరువాత ఆమె ఫేస్ బుక్‌లో ఒకే ఒక్క ఫొటోని షేర్ చేసింది. ఆ తరువాత శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో కనిపించడం మానేయడంతో ఆమె అనారోగ్యానికి గురైందంటూ వార్తలు వచ్చాయి. శ్రీరెడ్డి కరోనా బారిన పడిందని.. తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్‌లో చికిత్స పొందుతుందని పలు వార్తలు రాగా వీటిపై స్పందిస్తూ ‘సమయం’తో ఫోన్‌లో మాట్లాడారు శ్రీరెడ్డి. తనకు హెల్త్ ఇష్యూస్ ఉన్న మాట నిజమే అని చెప్పిన శ్రీరెడ్డి.. కరోనా బారిన పడలేదని వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఫేస్ బుక్‌కి దూరం కావడానికి కరోనా కారణం కాదు.. డిప్రెషన్ ఎక్కువైపోవడంతో డాక్టర్‌ని సంప్రదించాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్ తీసుకున్నా.. అందుకే ఫేస్ బుక్‌లో యాక్టివ్‌గా లేను. చెన్నైలో ఇల్లు మారడం.. ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. మధ్యలో హైదరాబాద్‌కి కూడా వచ్చాను.. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. నాకు జబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు.. ఈ డిప్రెషన్ అనే ప్రాబ్లమ్ వల్ల లాక్ డౌన్‌లో చాలామంది బాధపడుతున్నారు. ఫైనాన్సియల్‌గా కూడా చాలామంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి నాతో పాటు అందరూ బయటపడాలని కోరుకుంటున్నా. అయితే ఇప్పుడైతే ఫేస్ బుక్‌కి దూరంగా ఉన్నాను కానీ.. యూట్యూబ్‌కి సంబంధించి కొన్ని వీడియోలు బ్యాకప్ చేస్తున్నా.. వరుసగా వీడియోలను రిలీజ్ చేస్తా’ అని క్లారిటీ ఇచ్చారు శ్రీరెడ్డి.
from https://ift.tt/3xs7JL2
No comments:
Post a Comment