ప్రస్తుతం అంతటా కూడా టెక్నాలజీనే నడుస్తోంది. తప్పులు చేసి తప్పించుకుందామనుకునే వారిని సాంకేతిక పరిజ్ఞానం పట్టించేస్తుంది. వేగం ప్రమాదకరం.. నెమ్మదిగా ప్రయాణించండి అని చెబితే వినే వారే ఉండటం లేదు. అందుకు హైద్రాబాద్ సిటీ పరిసరాల్లో సెన్సార్ కెమెరాలను అమర్చారు. నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్తే.. కెమెరాలు బంధించేస్తాయి. ఇంటికి వచ్చేస్తాయి. అలా కూకట్ పల్లి ఫోరం మాల్ వద్ద నిర్దేశించిన వేగంపై నెట్టింట్లో సెటైర్లు పడుతున్నాయి. ఫోరం మాల్ వద్ద గరిష్ట వేగం మరీ 40 ఉండటం ఏంటి? కనీసం ఓ 60 అయినా పెట్టొచ్చు కదా? అని నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ఇప్పటికే నాలుగు సార్లు చలాన్లు కట్టేశాను.. నాలుగు వేలు ఖతమయ్యాయని వాపోయాడు. దీనిపై యంగ్ ప్రొడ్యూసర్ అహి తేజ కూడా స్పందించాడు. తాను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాననంటూ తనకు పడిన చలాన్ల గురించి చెప్పేశాడు. నందితా శ్వేత హీరోయిన్‌గా వచ్చిన అక్షర సినిమా నిర్మించిన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. మెగా అభిమాని అయిన ఈ నిర్మాత ఎక్కువగా రామ్ చరణ్‌కు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటారు. అలాంటి నిర్మాత తనకు పడిన చలాన్ల గుట్టు విప్పాడు. తాను కూడా ఫోరం మాల్ మీదుగా వెళ్తున్న సమయంలో ఇలానే చలాన్లు పడ్డాయని, దాదాపు ఐదు వేలు కట్టాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో పెట్టేశాడు.
from https://ift.tt/3yqtGLE
No comments:
Post a Comment