అక్కినేని కోడలు సమంతతో అల్లు వారి మనవరాలు, అల్లు అర్జున్ కూతురు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి '' సినిమాలో భాగమవుతున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా.. ఆ సెట్‌లో అడుగుపెట్టి సందడి చేసింది చిన్నారి అల్లు అర్హ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా గ్రాండ్‌గా సినీ ఎంట్రీ ఇవ్వబోతుండటం మెగా కాంపౌండ్ అభిమాన వర్గాలను ఖుషీ చేస్తోంది. 'శాకుంతలం' మూవీలో ఓ హిస్టారికల్ రోల్‌తో అల్లు అర్హ కెమెరా ముందుకు రాబోతోంది. అయితే మొదటి రోజు ఆమె సెట్స్ లోకి రావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పింది శాకుంతలం టీమ్. తండ్రి ఖరీదైన క్యారవాన్‌లో లొకేషన్‌కి చేరుకున్న ఆమె.. తొలిసారి ముఖానికి రంగేసుకుంది. ప్రస్తుతం ఆమె మేకప్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో తనదైన స్టైల్‌లో సెట్‌లో అందరితో కలివిడిగా ఉందట అల్లు అర్హ. సెట్‌లో క్రమశిక్షణగా మెదులుతూ తొలిరోజే ప్రొఫెషనల్ వారసురాలిగా అందరి దృష్టిని ఆకర్షించిందని సమాచారం. డైరెక్టర్ గుణశేఖర్ కూడా అల్లు అర్హ తీరు చూసి ఆ రోల్ పట్ల ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెంచుకున్నారని అంటున్నారు. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా 'శాకుంతలం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి అక్కినేని కోడలు సమంత పౌరాణిక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
from https://ift.tt/3jqScpY
No comments:
Post a Comment