సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సోషల్ మీడియాలో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూనే ఉంటారు. ఫెమినిస్ట్ అంటూ ఆమెకు ముద్ర వేసి.. ఆమె ఏ పని చేసినా కూడా టార్గెట్ చేస్తుంటారు. అయితే ఆమె మగ వారి సమస్యలపైనా స్పందిస్తుంటారు. కానీ ఎక్కువగా మహిళలకు జరిగే అన్యాయాలు, వేధింపులు, అత్యాచారాలపై ఎక్కువగా స్పందిస్తుంటారు. అలాంటి చిన్మయి ఎక్కువగా నెట్టింట్లో దూషణలు ఎదుర్కొంటుంటారు. తాజాగా చిన్మయి ఘటన మీద స్పందించడంతో వివాదం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన రెండు మూడు రోజులు సోషల్ మీడియాను ఊపేస్తోంది. లక్నో గర్ల్ పేరిట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ క్యాబ్ డ్రైవర్‌ను యువతి చెడామడా వాయించేసింది. దీన్ని మొదట మీడియా మొత్తం ఆ యువతి కోణంలోంచే ప్రసారం చేసింది. ధీర వనిత, ధైర్యంగా అలా ఉండాలి అంటూ కథనాలు రాసేసింది. కానీ అక్కడ తప్పంతా కూడా ఆ యువతిదే అని తరువాత కథనాలు వచ్చాయి. పోలీసులు కూడా మొదటగా ఆ యువతిని వదిలిపెట్టి క్యాబ్ డ్రైవర్ మీదే కేసులు బనాయించి లోపల పడేశారు. ఆ తరువాత ఈ వీడియోలు తెగ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా ఒత్తిడితో ఆ యువతి మీద కేసులు పెట్టి, విచారణ చేస్తున్నారు. ఇందులో అందరూ కూడా క్యాబ్ డ్రైవర్‌కు మద్దతు తెలుపుతున్నారు. అతని కారు, ఫోన్‌లను పగలగొట్టేసింది.. అందరి ముద్దు కొట్టి పరువుతీసేసింది. ఇంత చేసినా కూడా అతను ఆ యువతిని శిక్షించాలని డిమాండ్ చేయడం లేదు.. తన పరువు తనకు తిరిగి వచ్చేలా చేయండి.. ఫోన్, కారు పగలగొట్టడం వల్ల దాదాపు 60వేల వరకు నష్టం జరిగింది.. దాన్ని రికవరీ చేసి ఇప్పించండని డిమాండ్ చేస్తున్నాడు. అలా లక్కో గర్ల్ ఘటన దేశం మొత్తం వైరల్ అయింది. దీనిపై చిన్మయి కూడా స్పందించారు. ఆ అమ్మాయి అలా ప్రవర్తించి ఉండకూడదు.. ఇలా ఎవ్వరు చేసినా తప్పే.. అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన మీద చిన్మయి స్పందించడంతో ఈ విషయం రకరకాలుగా మలుపులు తిరిగింది. చిన్మయిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా తిడుతున్నారు. రాయడానికి వీలు లేనటు వంటి మాటలతో దాడి చేస్తున్నారు. అలాంటి అసభ్య కరమైన సందేశాల గురించి చిన్మయి మాట్లాడుతూ.. ఇలా నాకు వచ్చినట్టుగా కొన్ని వందల మంది మహిళలకు ఇలాంటి సందేశాలు మగవాళ్లు పంపుతున్నారు. వేల మంది నటీమణులకు రోజూ ఇలాంటివే వస్తుంటాయి. పురుషాంగం ఫోటోలను, హస్త ప్రయోగానికి సంబంధించిన వీడియోలను సందేశాలుగా పంపుతుంటారు. చాలా మంది మగవారు ఎంతో దారుణంగా మెసెజ్‌లు చేస్తుంటారు. అవన్నీ కూడా నేను ప్రతీ రోజూ ఇలా షేర చేయను. అవి చూస్తే అసలు మీరు తట్టుకోలేరు. కానీ కొన్ని సందర్భాల్లోనైనా ఇలా కొంత మంది చేసే కామెంట్లను చూపించడం కూడా మంచిదే. మన వాళ్లుఎలా ప్రవర్తిస్తుంటారు.. ఎలాంటి వారో తెలుస్తుంది అని చిన్మయి ఆవేదన చెందారు.
from https://ift.tt/3Acv84N
No comments:
Post a Comment