సినిమా పాటల రచయిత సాధారణంగానే చాలా సైలెంట్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆయన వివాదాలకు చాలా దూరంలో ఉంటారు. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. లేదా ఈవెంట్‌లో పాల్గొన్నా.. ఆయన వచ్చిన పనేంటో అది చేసుకొని వెళ్లిపోతారు. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే.. చాలా జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా మాట్లాడుతారు. ఆయన ఎలా ఉంటారో.. ఆయన పాటలు కూడా అలాగే సౌమ్యంగా ఉంటాయి. తాజాగా అనంత శ్రీరామ్ కలం నుంచి జాలువారిన పాట ‘దిగు దిగు నాగ’. ‘’ అనే సినిమా కోసం ఆయన ఈ పాట రాశారు. అయితే ఇప్పుడు ఈ పాటనే ఆయన్ని చిక్కులో పడేసింది. ఈ పాట దేవుడిని కించపరిచేలా ఉంది అంటూ బ్రహ్మణ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ‘దిగు దిగు నాగ’ ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలకు కించపరుస్తున్నరంటూ మండిపడ్డాయి. ఈ మేరకు వాళ్లు చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో అనంత శ్రీరామ్‌పై ఫిర్యాదు చేశారు. గతంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నెల్లూరులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బ్రహ్మణ సంఘాల నేతలు కూడా ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ఉదృతం అయింది. ఫిర్యాదు చేసే ముందు నాగ దేవత ప్రతిమలకు బ్రహ్మణ సంఘాల నేతలు పూజలు నిర్వహించి.. అనంత శ్రీరామ్ మంద బుద్ధి మారాలి అని ప్రార్థనలు చేశారు. సినిమా నుంచి వెంటనే ఈ పాటను తొలగించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఇక లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో రూపొందిన ‘వరుడు కావలెను’ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో నాగశౌర్య, రితూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.
from https://ift.tt/3fJKPZp
No comments:
Post a Comment