Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లోకి యాంకర్ వర్షిణి.. సాక్ష్యం ఇదే! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 2 August 2021

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లోకి యాంకర్ వర్షిణి.. సాక్ష్యం ఇదే!

షోకు ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ప్రాంతీయ భాషలోనూ ఇప్పుడు బిగ్ బాస్ షో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అలా ఇప్పుడు తెలుగులో ఐదో సీజన్ కోసం రంగం సిద్దమైంది. బిగ్ బాస్ షోకు సంబంధించిన రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. షో ఉన్నా లేకున్నా.. నడుస్తున్నా.. షో ముగిసినా కూడా ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఐదో సీజన్ మీద ఇప్పుడు స్టార్ మా అధికారికంగా ప్రకటించేసింది. లోగోకు సంబంధించిన డీటైల్స్ ఇచ్చేసింది. ఈ సారి బిగ్ బాస్ కన్ను గోల్డ్ కలర్‌లోకి మారింది. ఇక కంటి లోపల పజిల్ లాంటి పద్మవ్యూహాన్ని ఏర్పర్పించింది. అంటే ఈ సారి ఆట మరింత క్షిష్టంగా, కొత్తగా ఉండబోతోన్నట్టు హింట్ ఇచ్చేసింది. త్వరలోనే వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ వస్తున్నాడని చెప్పేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బిగ్ బాస్ షో సెప్టెంబర్ మొదటి వారంలోనే రానుంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక హోస్ట్‌గా నాగార్జున కాదు.. రానా అని రూమర్లు వచ్చాయి. కానీ వినిపిస్తున్న సమాచారం మేరకు నాగార్జుననే హోస్ట్‌గా రాబోతోన్నారు. ఇక కంటెస్టెంట్ల విషయంలో కాస్త స్పష్టత వచ్చింది. ఈ సారి మహిళలే ఆధిపత్యాన్ని చూపించబోతోన్నారట. పురుషుల కంటే మహిళా కంటెస్టెంట్లే ఎక్కువ సంఖ్యలో ఉండబోతోన్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఎక్కువగా బుల్లితెర సెలెబ్రిటీలే కనిపించబోతోన్నట్టు తెలుస్తోంది. యాంకర్ రవి, నవ్యస్వామి, సిరి హన్మంత్ వంటి వారు కన్ఫామ్ అయినట్టు లీకులు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఫిక్స్ అయ్యాడని టాక్. అయితే వీళ్ల సంగతి ఎలా ఉన్నా కూడా మాత్రం ఫిక్స్ అయినట్టు అనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు కూడా హింట్ ఇస్తున్నాయి. నిన్న జరిగిన కామెడీ స్టార్స్ షోలో వర్షిణి మాయమయ్యారు. శ్రీముఖి ప్రత్యక్షమయ్యారు. మొదటి రోజు శ్రీముఖి చేసిన కామెంట్లను చూస్తే ఇక ఎప్పటికీ వర్షిణి అందులోకి రాదని అర్థమవుతోంది. బిగ్ బాస్ షోలోకి వర్షిణి వెళ్తుండటంతోనే ఇలా కామెడీ స్టార్స్ షోకు గుడ్ బై చెపాల్సి వచ్చిందని తెలుస్తోంది. అలా కామెడీ స్టార్స్ షోలో వర్షిణి కనిపించకపోవడంతో బిగ్ బాస్ షోలోకి వెళ్లడం కన్ఫామ్ అయి ఉంటుందని థియరినీ నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు. అయితే వర్షిణికి మూవీ ఆఫర్లు కూడా వచ్చాయి. సమంత శాకుంతలం, సుమంత్ సినిమాల్లో ఆఫర్ వచ్చింది. మరి వర్షిణి బిగ్ బాస్ షోలోకి వస్తే వాటి సంగతి ఏంటి? అసలు కామెడీ స్టార్స్ షోలో కనిపించకపోవడం, బిగ్ బాస్ షోలోకి రావడం అనే ఈ థియరీకి సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి త్వరలోనే సమాధానం దొరకనుంది.


from https://ift.tt/3fljHQa

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages