Afghanistan: అక్కడ అలా ఉండటమే నేను చేసిన తప్పైంది.. చంపేస్తామన్నారు: హీరో సత్యదేవ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, 17 August 2021

demo-image

Afghanistan: అక్కడ అలా ఉండటమే నేను చేసిన తప్పైంది.. చంపేస్తామన్నారు: హీరో సత్యదేవ్

Responsive Ads Here
photo-85398268
ఆఫ్గానిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌నుతో పాటు పూర్తి దేశాన్ని తమ హస్తగతంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. వారం రోజుల క్రితం వరకూ ప్రశాంతంగా ఉన్న దేశం.. ప్రస్తుతం మాత్రం అల్లకల్లోలంగా మారిపోయింది. దేశ అధ్యక్షుడు.. విదేశాలకు పారిపోవడం.. సైన్యం అసమర్థ్యంగా చేతులు ఎత్తివేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. అక్కడ విదేశీయులు కూడా తమ స్వస్థలాలకు తరలిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అఫ్గన్ దాటేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రజలు ఒక్కసారిగా విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న అమెరికా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. కాబూల్ నుంచి బయలుదేరిన అమెరికా విమానం రెక్కలపైకి ఎక్కి ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఇలా విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు జారిపడి ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులను అదుపుచేయడానికి కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొన్ని రోజుల క్రితం హీరో అఫ్గానిస్థాన్‌లో తన సినిమా షూటింగ్‌ జరిపారు. తీవ్రవాదం నేపథ్యంలో ‘హబీబ్’ అనే సినిమాలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో సమయంలో తమకు తీవ్ర ఆటంకాలు, ప్రమాదాలు ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు ఫోస్ చేసి చంపేస్తామని బెదిరించేవారని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ తరహా దుస్తులు ధరించి సత్యదేవ్‌పై చిత్రీకరణను చేయగా అతడి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడగా.. పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.


from https://ift.tt/3m8Uo8l

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages