Who Is Balakrishna: దారుణమైన ట్రోల్స్.. రెహమాన్ ఫ్యాన్స్ Vs నందమూరి ఫ్యాన్స్.. నెట్టింట దుమ్ము దుమారం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 22 July 2021

Who Is Balakrishna: దారుణమైన ట్రోల్స్.. రెహమాన్ ఫ్యాన్స్ Vs నందమూరి ఫ్యాన్స్.. నెట్టింట దుమ్ము దుమారం

సాధారణంగా అయితే నందమూరి నటసింహం వివాదాల జోలికి పోయిన దాఖలాలు పెద్దగా లేవు. కాకపోతే ఆయన మాట్లాడే మాటలే ఆయన్ను వివాదాల్లోకి నెట్టి వేస్తాయి. సడెన్‌గా నోరుజారి ఇప్పటికే చాలాసార్లు చిక్కుల్లో పడ్డ బాలకృష్ణ.. మరోసారి అదే రిపీట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు. నెట్టింట బాలకృష్ణపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో రెహమాన్ ఫ్యాన్స్ Vs నందమూరి ఫ్యాన్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. రీసెంట్‌గా ‘భారతరత్న’ ఎన్టీఆర్ కాలిచెప్పుతో, ఆయన కాలి గోటితో సరిపోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు.. సంగీత దర్శకుడు ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. పదేళ్లకు ఒక హిట్ కొట్టేవారిని పెద్దగా పట్టించుకోనని చెప్పిన బాలయ్య, ఆస్కార్ అవార్డు అని ఏవోవే అంటారని ఎద్దేవా చేశారు. దీంతో రెహమాన్‌పై చేసిన ఈ కామెంట్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. వెంటనే రెహమాన్ ఫ్యాన్స్ బాలయ్య బాబుపై ట్రోల్స్‌కి దిగారు. అసలు ఈ బాలకృష్ణ ఎవరు? అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెంట్ చేస్తూ బాలయ్యపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు రెహమాన్ ఫ్యాన్స్. దీంతో ఇది చూసిన నందమూరి అభిమానులు బాలయ్యకు మద్దతుగా నిలుస్తూ తోటి నటీనటులతో ఆయన మెలిగే తీరు, బాలయ్య మనస్తత్వం గురించి కామెంట్లు వదులుతున్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం పెరిగి ఈ ఇష్యూ రచ్చకు దారితీసింది. బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బోయాపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్నారు. ''సింహా, లెజెండ్'' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from https://ift.tt/3BtIhYN

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages