Samantha: నారప్పపై సమంత రివ్యూ.. ఒక్కమాటలో చెప్పేసిన అక్కినేని కోడలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 22 July 2021

Samantha: నారప్పపై సమంత రివ్యూ.. ఒక్కమాటలో చెప్పేసిన అక్కినేని కోడలు

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన '' మూవీ ఇటీవలే విడుదలైన విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో వెంకీ నటన అబ్బురపరిచింది. ఎమోషన్స్, ఫైట్స్, యాక్షన్ అన్నింటా భేష్ అనిపించుకున్నారు వెంకటేష్. దీంతో ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా.. తాజాగా ఈ మూవీ చూసిన అక్కినేని కోడలు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘నారప్ప’ మూవీ పోస్టర్‌ను పెట్టి, హీరో వెంకటేష్‌ను ఉద్దేశిస్తూ.. ''వావ్.. వావ్ వ్‌వ్‌వ్‌వ్'' అనేసింది. ఆమె చేసిన ఈ సింగిల్ లైన్ కామెంట్ చూసి దగ్గుబాటి అభిమానులు ఫిదా అవుతున్నారు. వెంకీ ఫ్యాన్స్ సమంతకు థాంక్స్ చెబుతున్నారు. ఇకపోతే ఈ 'నారప్ప' మూవీ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. డి. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్ జోడీగా అందాల తార, సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటించింది. రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ బాణీలు కట్టారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


from https://ift.tt/3xZz5t5

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages