ప్రెజెంట్ ప్రతి ఒక్కరిచూపు రాజమౌళి రూపొందిస్తున్న RRRపైనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే రాజమౌళి గత సినిమాల్లోలాగే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ.. ఈ అక్టోబర్‌లో విడుదలకు రెడీ అవుతోంది. ఇదిలాఉంటే ఈ సినిమాపై నెలకొన్న వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయ్యారు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ పాత్రకు సంబంధించి వదిలిన పోస్టర్, వీడియోలో ఆయన తలపై ముస్లిం టోపీ ధరించడం కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. దీనిపై కొమురం భీమ్ వారసులతో పాటు, చరిత్రకారులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో కొమురం భీమ్‌ని పట్టుకోవడానికి నిజాం ప్రభువులు యత్నించారని, అయితే నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీమ్ ముస్లిం యువకుడిగా మారి, ముస్లిం టోపీ ధరించాడని చెప్పారు. ఇకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని కథ రాశామని అన్నారు. రాజమౌళి చేసే ఏ రెండు సినిమాలనూ ఒకదానితో ఒకటి పోల్చలేమని చెప్పిన ఆయన బాహుబలికి, RRRకు పోలిక లేదని అన్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి RRR సినిమా రూపొందిస్తున్నారు. బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ శ్రీయ కీలకపాత్రలో కనిపించనుంది.
from https://ift.tt/2Uud9rC
No comments:
Post a Comment