అక్కినేని వారింట పెళ్లి బాజాలు.. రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్..! పెళ్లి కూతురు ఎవరంటే.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 28 July 2021

అక్కినేని వారింట పెళ్లి బాజాలు.. రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్..! పెళ్లి కూతురు ఎవరంటే..

టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్‌ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. సుమంత్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోబోతున్నారు. కరోనా నేపథ్యంలో.. వీరి వివాహ వేడుకను నిరాడంబరంగా జరపనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. సుమంత్‌కు పవిత్ర బాల్య స్నేహితురాలని... ఇద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకొన్నారని తెలుస్తోంది. సుమంత్‌‌-పవిత్ర జంటగా వెళ్లి బంధుమిత్రులకు తమ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఇన్విటేషన్లో వీరి వివాహ వేదిక వివరాలు కనిపించకపోవడంతో... కొంత సస్పెన్స్ నెలకొంది. సుమంత్‌ 2004లో హీరోయిన్‌ కీర్తిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కీర్తితో పెళ్లైన రెండేళ్లకు విడిపోయాం. తను మరో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. తను సంతోషంగా ఉంది. తనతో విడిపోయినప్పటికీ.. మేం ఇద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నాం’’ అని చెప్పారు. కీర్తిరెడ్డితో విడాకుల తర్వాత 15 ఏళ్లపాటు ఒంటరి జీవితం గడిపిన సుమంత్.. మళ్లీ పెళ్లి చేసుకోబోతుండటం.. అక్కినేని ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది. అక్కినేని నాగేశ్వర రావు పెద్ద మనువడైన సుమంత్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథ’ చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. సత్యం, గోదావరి, గోల్కోండ హైస్కూల్ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. చాలా కాలంపాటు పరాజయాలు ఎదుర్కొన్న సుమంత్.. మళ్లీ రావా చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. ఈ సినిమా అనంతరం విడుదలైన ‘కపటధారి’కి మిశ్రమ స్పందన వచ్చింది. సుమంత్ ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ చిత్రంలో నటిస్తున్నారు.


from https://ift.tt/3BPsWlp

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages