‘సార్పట్ట’ మూవీ రివ్యూ.. కష్టపడ్డ ఆర్య! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 22 July 2021

‘సార్పట్ట’ మూవీ రివ్యూ.. కష్టపడ్డ ఆర్య!

తమిళ దర్శకుడు పా రంజిత్ తీసే చిత్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ రజినీతో తీసిన కాలా, కబాలితో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. స్టైలీష్ మేకర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ ఈ సారి ఆర్యను బాక్సర్‌గా చూపించారు. నేడు (జూలై 22) సార్పట్ట పరంపర అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఎమర్జెన్సీ సమయంలోని తమిళ నాడు ప్రాంతంలో జరిగినట్టుగా సాగే సార్పట్ట పరంపరలో ఏ మేరకు ఆకట్టుకున్నారు.. దర్శకుడిగా పా రంజిత్ సక్సెస్ అయ్యారో లేదో ఓ సారి చూద్దాం. సార్పట్ట కథ మొత్తం కూడా బాక్సింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఆంగ్లేయులు తమ వినోదం కోసం నేర్పించిన ఈ బాక్సింగ్ ఆటను పరంపరగా కొనిసాగిస్తూనే వచ్చారు. అలా బాక్సింగ్ ఆటలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చే సార్పట్ట పరంపరకు రంగయ్య (పశుపతి) శిక్షణ ఇస్తుంటారు. సార్పట్ట పరంపర కోసం బాక్సింగ్ ఆడి చివరకు రౌడీగా ముద్ర పడి హత్యకు గురవుతాడు మునిరత్నం (కిషోర్). మునిరత్నం చావుతో భాగ్యమ్మ (అనుపమ కుమార్) కొడుకు సమర (ఆర్య)ను బాక్సింగ్ ఆటకు దూరంగా పెంచుతుంది. కానీ చిన్నతనం నుంచి కూడా బాక్సింగ్ ఆట అన్నా, గురువు రంగయ్య అన్నా కూడా సమరకు ఎంతో ఇష్టం. అయితే అపజయం ఎరుగని సార్పట్టకు ఇడియప్ప పరంపరకు చెందిన వేటపులి (జాన్ కొక్కెన్) చుక్కలు చూపిస్తుంటారు. వరుసగా వేట పులి చేతిలో సార్పట్టకు చెందిన యోధులు ఓడిపోతూనే ఉంటారు. ఇక చివరగా ఒక్క ఆట ఆడదాం.. అందులో మేం ఓడిపోతే ఇకపై బాక్సింగ్ ఆడమంటూ సార్పట్ట గురువు రంగయ్య సవాల్ విసురుతారు. అయితే అందులో వేటపులిని ఎదుర్కొనేందుకు ఎవరు సిద్దపడతారు? సార్పట్ట పరంపర గౌరవాన్ని కాపాడేందుకు సమర ఏ విధంగా సిద్దపడతారు? సమరను ఓడించేందుకు సార్పట్టకు చెందిన వారే ఎలాంటి కుట్రలు పన్నుతారు? ఇందులో గురువు రంగయ్య కుమారుడు వీర చేసే ప్లాన్ ఏంటి? అసలు చివరకు వేటపులి సమర పోరు ఏవిధంగా ముగుస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సార్పట్ట పరంపర. సార్పట్ట పరంపర అంటే అణువణువునా అభిమానం ఉన్న సమర పాత్రలో ఆర్య చక్కగా నటించారు. సమర పాత్ర కోసం ఆర్య బాగానే కష్టపడ్డాడు. యాక్షన్, ఎమోషన్,కామెడీ ఇలా అన్నింటిని పండించేశాడు. సమర భార్యగా మంగమ్మ పాత్రలో దుషార విజయన్ పర్వాలేదనిపించింది. గురువు రంగయ్యగా పశుపతి చక్కగా సరిపోయారు. జాన్ కొక్కెన్ వేటపులిగా అదరగొట్టేశాడు. రాముడు, వీర, డాడీ ఇలా మిగిలిన పాత్రల్లో అందరూ చక్కగా నటించేశారు. బాక్సింగ్ ఆటతోనే తమ పరువు ముడిపడి ఉందని అక్కడి ప్రజలు అనుకోవడం, దాని మీదే పందెలు కాసుకోవడం వంటి వాటితో నాటి పరిస్థితులను చూపించారు దర్శకుడు. ఎమర్జెన్సీ సమయంలో తమిళనాడులో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను కూడా తీసుకున్నారు. స్టాలిన్ అరెస్ట్ కావడం వంటి వాటిని ప్రస్థావించారు. ఇక మామూలుగా స్పోర్ట్స్ డ్రామా అంటూ అందులో కొన్ని కుట్రలు, కుతంత్రాలు ఉండాల్సిందేన్నట్టుగా ఓ సూత్రాన్ని అందరూ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ముందు హీరో ఫిట్‌గా ఉండి ఆటను ఓ ఊపు ఊపేస్తాడు. మధ్యలో కొన్ని కారణాలతో ఫిట్ నెస్ కోల్పోవడం, మళ్లీ చివరకు ఓ పాటను పెట్టి అందులో హీరో తెగ కష్టపడి మళ్లీ యథావిథిగా ఫిట్‌‌గా మారినట్టు చూపించేస్తుంటారు. సార్పట్టలోనూ ఇదే జరిగింది. ముందు బాక్సింగ్ ఆటకు దూరంగా ఉంటూనే దానిపై మక్కువ పెంచుకునే సమరకు ఆట ఆడే చాన్స్ వస్తుంది. ఇక ఆటను ఆడి సార్పట్టను గెలిపించే సమయంలో కథ అడ్డం తిరుగుతుంది. ఎమర్జెన్సీ టైం అంటూ తన గురువు రంగయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పటి నుంచి సమర తప్పుదోవ పడతాడు. సారాయి కాస్తూ, రౌడీగా మారుతాడు. తాగుడుకు బానిసై తన ఫిట్ నెస్ పూర్తిగా కోల్పోతాడు. ఇక బాక్సింగ్ ఆటకు పనికి రాని వాడిలా తయారవుతాడు. అయితే మళ్లీ ఫిట్‌ నెస్‌ను పెంచుకుని బాక్సింగ్ రింగులోకి దిగుతాడు. ఇలాంటి కథనం కొత్తేమీ కాదు. అసలు ఈ కథలోనూ కొత్తదనం ఏమీ కనిపించదు. అలా దర్శకుడు ఏదో కొత్త పాయింట్ ఎంచుకుని, ఆసక్తిగా మలుచి ఉంటాడని అనుకునే ప్రేక్షకులకు నిరాశే కలుగుతుంది. ఒకానొక సమయంలో కథ ఎటో పోతోందనే భావన కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం ఏ కోశాన కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు. కుప్పలుకుప్పలుగా వచ్చి పడే తమిళ డబ్బింగ్ చిత్రాల్లో ఇదొక్కటిగానే మిగిలిపోతుంది. ఇక ఆ పాటలు పూర్తిగా తమిళ జనాలను మాత్రమే ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగం ఇలా అన్నీ కూడా ఓ మోస్తరుగా మెప్పిస్తాయి. ఆర్య పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని సార్పట్ట ఇవ్వకపోవచ్చనిపిస్తోంది. చిరవగా.. రొటీన్ చిత్రాల పరంపరలో ‘సార్పట్ట పరంపర’ ఒకటి.


from https://ift.tt/3xZu8Ai

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages